ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: శ్రీ వారితో పోటీ పడిన రామచంద్రుడు.. రికార్డు స్థాయిలో అయోధ్య తొలిరోజు ఆదాయం

ABN, Publish Date - Jan 25 , 2024 | 08:15 AM

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు(Ayodhya Ram) పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు.

అయోధ్య: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయానికి శ్రీ అయోధ్య రాముడు(Ayodhya Ram) పోటీ పడుతున్నాడు. జనవరి 22న ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు 5 లక్షలకుపైగా భక్తులు అయోధ్య రాములోరిని దర్శించుకున్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ ఇన్‌ఛార్జ్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రాణ ప్రతిష్ఠ తరువాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు చెప్పారు. మంగళవారం భక్తులు ఆలయ కౌంటర్లలో నగదు, ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించారు.

ఆ ఒక్క రోజు వచ్చిన మొత్తం నగదు రూ.3 కోట్ల 17 లక్షలుగా తేలింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం సరాసరి రోజుకి రూ.3 - 4 కోట్లుగా ఉంటుంది. ఇలా శ్రీవారి ఆదాయానికి రాముడు పోటీ పడ్డాడన్నమాట. బుధవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదని.. 13 కి.మీ.ల మేర రాములవారి దర్శనానికి భక్తులు బారులు తీరినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Jan 25 , 2024 | 11:02 AM

Advertising
Advertising