ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. రామచంద్రుడి దర్శన వేళలు పొడగింపు..

ABN, Publish Date - Jan 24 , 2024 | 03:49 PM

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు.

అయోధ్య: అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే దాదాపు 5 లక్షల మంది రాముడిని దర్శించుకున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో 3 లక్షల మంది పగటిపూట దర్శించుకోగా.. మిగిలిన వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందనే అంచనాల నడుమ ఆలయ దర్శన వేళలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు.

ఇప్పటివరకు రెండు విడతల్లో రాత్రి 7 గంటలవరకు రాములవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇకపై రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతిస్తూ సమయాన్ని పొడగించారు. జనవరి 29వరకు హారతి కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపేశారు. అయోధ్యకు ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 24 , 2024 | 03:51 PM

Advertising
Advertising