ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది..

ABN, Publish Date - Jan 27 , 2024 | 08:06 AM

ఒడిశా(Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో రెండు బైక్‌లు, ఆటో, ట్రాక్టర్, డీసీఎం ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

భువనేశ్వర్: ఒడిశా(Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో రెండు బైక్‌లు, ఆటో, ట్రాక్టర్, డీసీఎం ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారిని కోరాపుట్‌లోని ఓ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వివరించారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు నవీన్ పట్నాయక్(Naveen Patnaik) సర్కార్ తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని సీఎం పట్నాయక్ అధికారులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులంతా ఆటో, బైక్‌లపై ప్రయాణిస్తున్నవారిగా తెలుస్తోంది.

Updated Date - Jan 27 , 2024 | 08:07 AM

Advertising
Advertising