Sanjay Singh: జైలు నుంచి భారీ సెక్యూరిటీతో వచ్చి నామినేషన్ వేసిన సంజయ్ సింగ్
ABN, Publish Date - Jan 08 , 2024 | 06:09 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) సోమవారం నాడు రాజ్యసభకు నామినేషన్ వేశారు. జైలు నుంచి భారీ భద్రత మధ్య సివిల్ లైన్స్ వద్దకు తన సహచర పార్టీ నేతలు స్వాతి మాలివాల్, ఎన్డీ గుప్తాలతో కలిసి వచ్చారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) సోమవారం నాడు రాజ్యసభకు నామినేషన్ వేశారు. జైలు నుంచి భారీ భద్రత మధ్య సివిల్ లైన్స్ వద్దకు తన సహచర పార్టీ నేతలు స్వాతి మాలివాల్, ఎన్డీ గుప్తాలతో కలిసి వచ్చారు. రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు కోర్టు నుంచి సంజయ్ సింగ్ అనుమతి తీసుకున్నారు.
‘పార్టీ కార్యకర్తలను కలిసిన తర్వాత సంజయ్ సింగ్‌లో (Sanjay Singh) ఉత్సాహాం పెరిగింది. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలో జైలు నుంచి విడుదలై పార్లమెంట్‌కు వెళతారు’ అని సంజయ్ సింగ్ భార్య అనిత విశ్వాసంతో ఉన్నారు.
ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో సంజయ్ సింగ్ (Sanjay Singh) కీలక పాత్ర పోషించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెబుతోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ వల్ల మద్యం తయారీ దారులు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు లాభదాయకంగా ఉందని పేర్కొంది. అభియోగాలు మోపి సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. శుక్రవారం స్వాతి మాలివాల్‌ను రాజ్యసభకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సంజయ్ సింగ్ (Sanjay Singh), ఎన్డీ గుప్తాకు రెండోసారి అవకాశం కల్పించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 08 , 2024 | 06:09 PM