ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ram Mandir: అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం

ABN, Publish Date - Jan 21 , 2024 | 02:38 PM

గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.

ఢిల్లీ: గుజరాత్‌లోని సూరత్(Surat) అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు. అందులో ప్రత్యేకతేముందనుకుంటున్నారా.. దాన్ని చేసింది స్వచ్ఛమైన వజ్రాలతో.. అవి కూడా ఒకటి తక్కువ 10 వేల వజ్రాలతో.

ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లటి అట్టపై ఈ వజ్రాలను వరుసగా పేర్చి అయోధ్య రామమందిరంతో కూడిన శ్రీ రాముడి కళాకృతిని డిజైన్ చేశారు. పైన జై శ్రీ రామ్ అని రాసి ఉంది. ఇది చూపరులను ఆకట్టుకుంటోంది. నగరంలోని ఒక వజ్రాల వ్యాపారి 5 వేల వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ను కూడా తయారు చేశాడు.

దీనిని రామమందిర్ ట్రస్టుకు బహుమతిగా ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవిత్రమైన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర ప్రముఖుల సమక్షంలో జనవరి 22న జరగనుంది. ఆలయ ట్రస్ట్ 7 వేల మందికి పైగా ప్రముఖులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది.

Updated Date - Jan 21 , 2024 | 02:39 PM

Advertising
Advertising