ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని వెళ్లారు.. అడ్డంగా దొరికిపోయారు.. పాపం!

ABN, Publish Date - Jan 29 , 2024 | 04:50 PM

మన గమ్యస్థానానికి మార్గం తెలియనప్పుడో లేదా వేగంగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గమేమైనా ఉందనో తెలుసుకోవడం కోసం.. ‘గూగుల్ మ్యాప్స్’ని వినియోగిస్తుంటారు. ఈ అధునాతన ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దీనినే వినియోగిస్తున్నారు. కానీ.. కొందరు ఈ గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని అనుకోని చిక్కుల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి.

గమ్యస్థానానికి మార్గం తెలియనప్పుడో లేదా వేగంగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గమేమైనా ఉందేమోనని తెలుసుకోవడం కోసం.. కొందరు ‘గూగుల్ మ్యాప్స్’పై ఆధారపడుతుంటారు. అసలు ఈ అధునాతన ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. ప్రతి ఒక్కరూ దీనినే వినియోగించడం మొదలుపెట్టారు. కానీ.. ఈ గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని కొందరు అనుకోని చిక్కుల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి సైతం అలాగే ఈ ఫీచర్‌ని నమ్మి మోసపోయాడు. వేగవంతమైన మార్గం చూపించిందని అటుగా వెళ్తే.. చివరికి మెట్ల మీద ఇరుక్కుపోవాల్సి వచ్చింది.


ఆ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు కొందరు స్నేహితులు తమ వీకెండ్‌ని ఎంజాయ్ చేయడం కోసం తమిళనాడులోని కొన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ వాళ్ల ట్రిప్ సజావుగానే సాగింది. అయితే.. తిరుగు ప్రయాణంలోనే వారికి ఊహించని పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ ఆధారంగా తమిళనాడు నుంచి కర్ణాటటకు ఒక కారులో బయలుదేరిన వీళ్లు.. తమిళనాడు, కేరళ, కర్ణాటకల మధ్య ట్రై-జంక్షన్ వద్ద ఉన్న గూడలూర్‌లో చిక్కుకుపోయారు. తమకు చూపించిన ఫాస్టెస్ట్ రూట్ ఆధారంగా వాళ్లు తమ కారుని గూడలూర్ పోలీస్ క్వార్టర్స్ వద్ద నుంచి తీసుకెళ్లారు. అయితే.. ఈ మార్గం వారిని ఒక నివాస ప్రాంతంలో నిటారుగా ఉన్న మెట్ల వద్దకు తీసుకువెళ్లింది. ఆ దెబ్బకు వాళ్లు అక్కడే కాసేపు చిక్కుకుపోయారు.

నిజానికి.. ఆ మెట్ల మీద నుంచి దిగడానికి ముందు ప్రధాన రహదారికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉందేమోనని వాళ్లు శోధించారు. కానీ.. మరో మార్గం లేదని తెలుసుకొని, ఆ మెట్ల ద్వారానే వెళ్లాలనని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వాళ్ల కారు ఆ మెట్లపై చిక్కుకుంది. అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక.. చివరికి స్థానికులు, పోలీసుల సహాయం కోరారు. ఫైనల్‌గా.. వారి సహకారంతో మెట్లపై నుంచి కారుని కిందకు దించి.. ప్రధాన రహదారికి చేరుకున్నారు. తమకు సహాయం చేసినందుకు ఆ స్నేహితుల బృందం వాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడటంలో తప్పు లేదు కానీ, మరీ గుడ్డిగా నమ్మకూడదని చెప్పడానికి.. ఈ ఘటనే ఉదాహరణ.

Updated Date - Jan 29 , 2024 | 05:17 PM

Advertising
Advertising