ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Budget: కేంద్ర బడ్జెట్ గురించి మీకు ఈ విశేషాలు తెలుసా

ABN, Publish Date - Jan 31 , 2024 | 03:30 PM

పార్లమెంటు సమావేశాలు అనగానే సాధారణంగా గుర్తొచ్చే పదం బడ్జెట్. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంతో కట్టాల్సిన అప్పులేంటి, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి, పథకాలకు కేటాయింపులెలా తదితర అంశాలను బడ్జెట్‌లో పొందుపరుస్తారు.

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు అనగానే సాధారణంగా గుర్తొచ్చే పదం బడ్జెట్. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంతో కట్టాల్సిన అప్పులేంటి, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి, పథకాలకు కేటాయింపులెలా తదితర అంశాలను బడ్జెట్‌లో పొందుపరుస్తారు. బడ్జెట్ తయారీ అనేది చాలా నెలల పాటు సాగే సుదీర్ఘమైన కసరత్తు.

నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి మొదటి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి బడ్జెట్లో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. 1955 వరకు కేంద్ర బడ్జెట్ ఇంగ్లీష్‌లోనే ముద్రించేవారు. 1955-56 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దేశ్‌ముఖ్ బడ్జెట్ పత్రాలను ఇంగ్లీష్, హిందీలో ముద్రింపజేశారు.


బడ్జెట్‌ గురించి ఆసక్తికర విషయాలు..

  • 2016 కేంద్ర బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు వరకు దేశ రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండేది. తరువాత కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ని విలీనం చేశారు.

  • అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌లు సమర్పించి రికార్డు సృష్టించారు. ఈ రికార్డు ఇప్పటివరకు చెక్కుచెదరలేదు.

  • బడ్జెట్ సమర్పణ సమయాన్ని 2001లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు.

  • 1973–74లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యశ్వంతరావు బి. చవాన్ బడ్జెట్‌ను సమర్పించారు. ఆ సంవత్సరానికి ద్రవ్య లోటు రూ.550 కోట్లు ఉన్నందున దీన్ని "బ్లాక్ బడ్జెట్" అని పిలిచారు.

  • ఫిబ్రవరి 1, 2021న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంప్రదాయ ' బహి-ఖాతా ' స్టైల్ పర్సులో ఉంచిన డిజిటల్ ట్యాబ్‌ను ఉపయోగించి మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు .

  • దేశ చరిత్రలో అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం 2020లో జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రతుల్ని చదివి వినిపించారు.

  • స్త్రీల అవసరాలపై దృష్టి పెట్టడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా 2005లో లింగ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Updated Date - Jan 31 , 2024 | 03:31 PM

Advertising
Advertising