Ram Mandir: భద్రతా వలయంలో అయోధ్య.. ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా
ABN, Publish Date - Jan 19 , 2024 | 04:41 PM
అయోధ్య రామ్ లల్లా ప్రాణ(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న వేళ.. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయోధ్య ఆలయ అధికారులకు ఈ మధ్యే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్య మొత్తాన్ని భద్రతావలయంలోకి తీసుకొచ్చారు.
అయోధ్య: అయోధ్య రామ్ లల్లా ప్రాణ(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న వేళ.. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయోధ్య ఆలయ అధికారులకు ఈ మధ్యే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్య మొత్తాన్ని భద్రతావలయంలోకి తీసుకొచ్చారు. నగరంలో ఏకంగా 12 వేల మంది పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. బెదిరింపు ఫోన్ కాల్స్, అనుమానాస్పద ఈ మెయిళ్లను గుర్తించడానికి ఏఐ(AI) టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సైబర్ ముప్పు పొంచి ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సైబర్ నిపుణుల బృందాన్ని అయోధ్యకు పంపింది. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలను గుర్తించడానికి భద్రతా ఏజెన్సీలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి.
"అయోధ్య చుట్టుపక్కల 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. వీటిలో 400 వరకు మందిర పరిసర ప్రాంతాల్లో, మిగతావి నగరం చుట్టు పక్కల ఉన్నాయి. తొలిసారిగా మనుషులను గుర్తించేందుకు AI టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం" అని యూపీ పోలీస్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. గతంలో నేరాలు చేసినవారు ఎవరైనా పట్టుబడితే వారి డేటాను పొందేందుకు ఇదివరకే నేరస్థుల డేటాబేస్‌లో వివరాలు అప్ లోడ్ చేశామన్నారు.
ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థ.. జన సమూహాల్లో అనుమానాస్పద కదలికలను కనిపెట్టడంలో సాయపడతాయి. జనవరి 22న జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా దేవ విదేశాల నుంచి వేల సంఖ్యలో ప్రముఖులు తరలి రానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 19 , 2024 | 04:43 PM