Republic Day: గణతంత్ర దినోత్సవ పరేడ్ శకటాల ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది...
ABN, Publish Date - Jan 02 , 2024 | 01:02 PM
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించే శకటాల ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుందో మీకు తెలుసా. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. అయితే ఆ రోజు అన్ని రాష్ట్రాల శకటాలకు అనుమతి లభించదు. పరేడ్ లో శకటాల(parade tableaux) ప్రదర్శనకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రత్యేక టీం వీటిని ఎంపిక చేస్తుంది.
ఢిల్లీ: దేశ గణతంత్ర దినోత్సవ(India Republic Day) వేడుకలకు ప్రజలు సిద్దమవుతున్నారు. 2024 జనవరి 26న ఈ వేడుకలు ప్రధాని మోదీ(PM Modi)సమక్షంలో జరగనున్నాయి. 2024కిగానూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీలో శకటాల ప్రదర్శనకు తమ రాష్ట్ర శకటాన్ని కూడా అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. అయితే దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబీల బలిదానాలను అనుమానిస్తోంది. ఈ సారి పరేడ్‌లో పంజాబ్ ని చేర్చలేదు. మేము 3 సబ్జెక్ట్‌లను పంపాం. అందులో పంజాబీల అమరవీరుల చరిత్ర, మై భాగో జీ చరిత్ర, పంజాబ్ వారసత్వం ఉన్నాయి.
వీటిని తిరస్కరించడం బీజేపీకి పంజాబ్ పై ఉన్న ప్రేమ ఎంటోతెలియ జేస్తోంది" అని భగవంత్ మాన్ మండిపడ్డారు. దీంతో ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేత హర్జీత్ గ్రేవాల్ మాట్లాడుతూ.. సెట్ పరిమితులకు అనుగుణంగా లేనందున పంజాబ్ అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. ఈసారి పంజాబ్‌తో పాటు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌ల పట్టికలను కూడా రిజెక్ట్ చేశారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించే శకటాల ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుందో మీకు తెలుసా.
టేబుల్ఆక్స్...
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. అయితే ఆ రోజు అన్ని రాష్ట్రాల శకటాలకు అనుమతి లభించదు. పరేడ్ లో శకటాల(parade tableaux) ప్రదర్శనకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రత్యేక టీం వీటిని ఎంపిక చేస్తుంది. కళలు, సంస్కృతి, పెయింటింగ్, శిల్పం, సంగీతం, వాస్తు, కొరియోగ్రఫీ మొదలైన విభాగాలకు చెందిన ప్రముఖులతో టేబుల్ఆక్స్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్దేశిస్తుంది. కమిటీ నిర్ణయం మేరకు శకటాల ప్రదర్శనకు అనుమతి లభిస్తుంది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఫైనల్ లిస్టులో ఉండేవి కొన్ని మాత్రమే. ఇందుకోసం ప్రతిపాదనలు పంపిన అన్ని ప్రాంతాల వివరాలను క్రోడీకరించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది.
సిఫార్సులు చేయడానికి ముందు థీమ్, కాన్సెప్ట్, డిజైన్, విజువల్ ఇంపాక్ట్ ఆధారంగా ప్రతిపాదనలను పరిశీలిస్తారు. మూల్యాంకన ప్రక్రియ వివిధ దశలను కలిగి ఉంటుంది. విజువల్ అప్పీయరెన్స్, ప్రభావం, దాని వెనక ఉన్న ఆలోచన, డిటైలింగ్ డిగ్రీ, సంబంధిత సంగీతం వంటి విషయాలను శకటాల ప్రదర్శనకు ముందు పరిశీలిస్తారు. ఎంపిక ప్రక్రియ జోనల్ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలు/యూటీలను ఆరు జోన్‌లుగా విభజించారు. అవి ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య. గతంలో రిపబ్లిక్ డే పరేడ్‌కు టేబులాక్స్‌ని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. 2022లో తమిళనాడు పట్టికను కమిటీ రిజెక్ట్ చేసింది. ఇది వివాదానికి దారితీసింది. "స్వాతంత్ర్య పోరాటంలో తమిళనాడు" అనే టాబ్లౌ థీమ్ ఉండటంతో తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Jan 25 , 2024 | 05:15 PM