ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: ఆ అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేను.. ఎక్స్‌లో మోదీ ఆసక్తికర పోస్ట్

ABN, Publish Date - Jan 21 , 2024 | 12:47 PM

ప్రధాని మోదీ(PM Modi) శనివారం తమిళనాడు పర్యటనలో తాను పొందిన అనుభూతిని సోషల్ మీడియా వేదిక ఎక్స్(X)లో పంచుకున్నారు. ఆయన రామేశ్వరంలోని(Rameshwaram) అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను మోదీ అధికారిక ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు.

ఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) శనివారం తమిళనాడు పర్యటనలో తాను పొందిన అనుభూతిని సోషల్ మీడియా వేదిక ఎక్స్(X)లో పంచుకున్నారు. ఆయన రామేశ్వరంలోని(Rameshwaram) అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను మోదీ అధికారిక ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు.

2 నిమిషాల 57 సెకన్ల నిడివిగల ఈ వీడియోను షేర్ చేస్తూ.. "రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేను. ఆలయాన్ని చూస్తే భక్తిభావం పొంగిపొర్లుతోంది" అని రాసుకొచ్చారు. సదరు వీడియోలో మోదీ రుద్రాక్షమాల ధరించి అగ్నితీర్థం బీచ్‌కి వెళ్లడం.. పురాతన రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కనిపిస్తోంది. ఇక్కడ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం. లింగప్రతిష్ఠానంతరం రాముడు, సీతాదేవీ ఇక్కడ పూజలు నిర్వహించారట.


కోదండ రామాలయంలో పూజలు

మోదీ ఆదివారం రామేశ్వరంలోని ధనుష్కోటిలో శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెప్పుకునే అరిచల్మునై ని కూడా ఆయన సందర్శించనున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:48 PM

Advertising
Advertising