ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేరళ గవర్నర్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత

ABN, Publish Date - Jan 28 , 2024 | 01:30 AM

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. అధికార పార్టీ సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎ్‌ఫఐ నిరసనలకు వ్యతిరేకంగా గవర్నర్‌ రోడ్డుపై

తిరువనంతపురం, జనవరి 27: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. అధికార పార్టీ సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎ్‌ఫఐ నిరసనలకు వ్యతిరేకంగా గవర్నర్‌ రోడ్డుపై రెండు గంటలు బైఠాయించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు.. శనివారం ఉదయం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కొల్లాం జిల్లాలో ప్రయాణిస్తున్న గవర్నర్‌.. రోడ్డుపక్కన ఎస్‌ఎ్‌ఫఐ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలపడం గమనించి కారు ఆపాలని సిబ్బందిని ఆదేశించారు. కారు దిగి నేరుగా ఆందోళనకారుల వద్దకు నడుచుకుంటూ వెళ్లిన గవర్నర్‌.. రాష్ట్రంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సీఎం విజయన్‌ ప్రోత్సహిస్తున్నారని, నిరసనకారులను అరెస్టు చేయడం లేదని నిందించారు. అధికారుల నుంచి స్పందన లేదంటూ నిరసనగా గవర్నర్‌ అక్కడే రెండు గంటల సేపు బైఠాయించారు. అయితే, తానేమీ నిరసన తెలపలేదని, ఎస్‌ఎ్‌ఫఐ నేతలపై చర్యలకు డిమాండ్‌ చేశానని, ఎఫ్‌ఐఆర్‌ కాపీని పోలీసులు తనకు అందించే వరకు అక్కడ వేచి ఉన్నానని గవర్నర్‌ తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 01:31 AM

Advertising
Advertising