ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Traditional bandage : కళ్లు చెదిరే కాంతల్లా...

ABN, Publish Date - Jan 17 , 2024 | 03:15 AM

కుందనపు బొమ్మల్లా వెలిగిపోవాలంటే కంచిపట్టు చీరల్లో కాంతులీనాలి. బంగారు, వెండి జరీ ధగ ధగలు, కలనేతల కళా ..

కుందనపు బొమ్మల్లా వెలిగిపోవాలంటే కంచిపట్టు చీరల్లో కాంతులీనాలి. బంగారు, వెండి జరీ ధగ ధగలు, కలనేతల కళా కాంతులు మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇలాంటి సంప్రదాయ కట్టు బొట్టును అనుసరించండి!

తెల్ల పట్టుచీర హుందాతనమే వేరు. ప్రింటెడ్‌ డిజైన్‌ మోడర్న్‌ లుక్‌ని తెచ్చిపెడితే, కాంట్రాస్ట్‌ జరీ బార్డరు చీర మొత్తానికే వన్నె తెస్తుంది.

చామంతులు, కనకాంబరాలు కలిపి కట్టిన పూమాలలా కనిపించాలంటే పవిట చెంగు, కుచ్చిళ్లు ఒక రంగులో, చీర మొత్తం మరో రంగులో ఉండాలి. అలాంటి కాంట్రాస్ట్‌ రంగుల్లోనే చీర భారీగా కనిపించి కనువిందు చేస్తుంది.

వెండి వెలుగులు విరజిమ్మాలంటే వెండి జరీలో ధగధగలాడాలి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే వెండి జరీ చీరను ఎంచుకుంటే సరి!

కుచ్చిళ్ల దగ్గర జరీ బార్డరు మోకాళ్ల వరకూ ఉండడం తాజా ఫ్యాషన్‌! ఈ స్టయిల్‌ చీరకు వినూత్న ఆకర్షణను తెచ్చిపెడుతుంది. ఆ జరీ మీద కనిపించీ, కనిపించకుండా ఉండే సెల్ఫ్‌ డిజైన్‌ ఈ చీరకున్న మరో ప్రత్యేకత.

Updated Date - Jan 17 , 2024 | 03:15 AM

Advertising
Advertising