ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Relationship: ఇలా ఉంటే దాంపత్య జీవితం ఆనందమయం..!

ABN, Publish Date - Jan 19 , 2024 | 04:53 PM

ఆవేశం వల్ల సమస్య పెద్దది అవుతుంది తప్పితే పరిష్కారం లభించదు. ఇద్దరిలో ఒకరి మీద ప్రతికూల సందర్భం వచ్చినపుడు కాస్త కూల్ గా వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటే సమస్య పెద్దది కాకుండా ఉంటుంది.

Understanding

ఓ బంధం నిలబడాలంటే దానికి దంపతులిద్దరూ సఖ్యతతో ఉండాలి. నమ్మకం అనే పునాది మీదనే బంధం నిలబడుతుంది. ప్రత్యేకంగా ప్రేమ వివాహంలో నమ్మకం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రావడానికి అవకాశం ఉంది. సంబంధంలో విశ్వాసం, నమ్మకం, ఆనందం తప్పక ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. బంధంలో అభద్రతా భావనను అధిగమించాలంటే సహాయపడే 7 ఆలోచనలు ఇవే..

భాగస్వామితో కమ్యూనికేట్ కండిలా..

ఇద్దరిమధ్యా మంచి సంభాషణ సాగాలి. ఇది చనువును తెస్తుంది. అభద్రతా భావంతో, నమ్మకంలేని విధంగా భాగస్వామితో ఉన్నట్లయితే బంధం మధ్య చీలికలు రావచ్చు. అదే నమ్మకంతో నిజాయితీతో కూడిన సంభాషణలతో కొనసాగించే బంధం నాలుగు కాలాలపాటు సురక్షితంగా ఉంటుంది. ఎదుటివారు చెప్పేది వినడం కూడా మంచి అలవాటే.. కమ్యూనికేషన్ ఇద్దరి మధ్యా బావుండేలా చూసుకోవాలి.


మూల కారణాలేంటనేది తెలుసుకుంటే..

గత అనుభవాలను పంచుకుంటూనే ఇద్దరి మధ్యా అనుబంధం పెరిగేలా చూసుకోవాలి. సంబంధాలు లోతైన అవగాహనతో సమస్యలను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. అలాగే ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి ముందే తెలిసి ఉండటం వల్ల పొరపాట్లు జరగకుండా అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఏ విధమైన సమస్య వచ్చినా దాని వెనుక కారణాలను తెలుసుకోగలుగుతారు. సమర్థవంతమైన పరిష్కారాన్ని సులభంగా వెతుకుతారు.

ప్రతికూల ఆలోచనలను వదిలి...

మనస్సులు మాస్టర్ స్టోరీటెల్లర్స్ కావచ్చు, డూమ్, గ్లామ్ కథలు నిరంతరం ఆలోచనల్లో తిరుగుతాయి. ఏదైనా చెడు మాట భాగస్వామి గురించి విన్నాకా అదే మన మనసులో తిరుగుతూ ఉంటుంది. ఇలా ఆలోచించేటప్పుడు మరో ఆలోచన మెదడుకు రాదు. దీనితో కోపం, అసహనం ఎక్కువగా కనిపిస్తుంది. అలా కాకుండా శాంతంగా ఆలోచించగలిగితే వెంటనే మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఆవేశం వల్ల సమస్య పెద్దది అవుతుంది తప్పితే పరిష్కారం లభించదు. ఇద్దరిలో ఒకరి మీద ప్రతికూల సందర్భం వచ్చినపుడు కాస్త కూల్ గా వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటే సమస్య పెద్దది కాకుండా ఉంటుంది.

ప్రేమ..

విజయాలు, బలాల గురించి ఎంత తక్కువగా అనిపించినా.. ప్రతిభ, అభిరుచులను పెంచుకుంటూ ఉండాలి. ఇవి వాళ్ళ మీద వాళ్ళకు ప్రేమ, ప్రశంసలు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. అభధ్రతాభావాలకు తక్కువ అవకాశం ఉంటుంది.


భవిష్యత్తుపై దృష్టి పెట్టండి, పోలికలపై కాదు...

మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం అనేది అభద్రతను పెంచడానికి కారణం అవుతుంది. ఒకరిని ఎంచి వారి జీవితాలలోకి తొంగి చూసే బదులు.. స్వంత ఎదుగుదలపై దృష్టి పెట్టడం చాలా మంచిది. వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ పద్ధతి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

భాగస్వామిపై నమ్మకాన్ని..

ఏదైనా విజయవంతమైన బంధానికి నమ్మకం మూలస్తంభం. నమ్మకాన్ని పెంపొందించడానికి నిజాయితీ, విశ్వసనీయత, పారదర్శకతపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. భాగస్వాముల మధ్య ఇవి భద్రతా భావాన్ని బలపరుస్తుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, నమ్మకంగా ఉండటం వంటివి బలమైన పునాదికి కారణం అవుతాయి.

Updated Date - Jan 19 , 2024 | 05:18 PM

Advertising
Advertising