ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Immune System: ఆహారంలో ఉసిరిని చేర్చడం వల్ల బరువు తగ్గడమే కాదు, మధుమేహం కూడా తగ్గుతుందా..!!

ABN, Publish Date - Jan 17 , 2024 | 12:29 PM

ఉసిరిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. చర్మం కూడా నిగారింపుతో కనిపిస్తుంది. ఉసిరిలో ఉండే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యకరంగా మెరిసేలా చేస్తాయి.

Amla

ఉసిరిని ఇండియన్ గూస్ బెర్రీ‍గా పిలుస్తారు. ఈ కాయల్లో ఎన్నో సుగుణాలున్నాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో ఒక ఉసిరికాయను తీసుకోవడం వల్ల చాలా పోషకాలు శరీరానికి అందుతాయి. ఎన్నోరకాల వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఉసిరితో శరీరానికి అందే మరిన్ని బలమైన ఆరోగ్య ప్రయోజనాలేమిటంటే..

మధుమేహాన్ని తగ్గిస్తుంది.

ఉసిరిలో ఉండే క్రోమియం కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నప్పుడు ఆహారంలో ఉసిరిని తీసుకోవడం మొదలు పెడితే ప్రయోజనం ఉంటుంది.

విటమిన్ సి అధికం..

ఉసిరిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని సపోర్ట్ చేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

ఇది కూడా చదవండి: కలోంజి విత్తనాలతో థైరాయిడ్ సమస్యను తగ్గించవచ్చు.. అదెలాగంటే..!


యాంటీ ఆక్సిడెంట్..

ఉసిరిని పచ్చిగా తినలేని వారు, ఊరగాయలా తయారు చేసి తీసుకోవచ్చు. లేదా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పులో ఊరబెట్టి కూడా తీసుకోవచ్చు. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి పనికి వస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మెరుగైన జీర్ణ క్రియ..

ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపును తేలిక చేస్తుంది. అజీర్ణం తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య ఉన్నా కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇది పేగు కదలికలకు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.

జుట్టు, చర్మానికి ఉసిరి..

ఉసిరిని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. చర్మం కూడా నిగారింపుతో కనిపిస్తుంది. ఉసిరిలో ఉండే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.


గుండెకు మేలు..

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఉసిరి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరిలో ఉన్న పోషక గుణాలు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ సహకరిస్తాయి.

బరువు తగ్గుదలకు..

అధిక బరువును తగ్గాలన్నా ఉసిరిలోని ఫైబర్ సపోర్ట్ చేస్తుంది. సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం కూడా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 17 , 2024 | 05:06 PM

Advertising
Advertising