ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Food Lovers: మాదాపూర్ కుమారి ఆంటీ కిచెన్‌కి ఎంత క్రేజ్ అంటే..!

ABN, Publish Date - Jan 25 , 2024 | 02:20 PM

చాలా వరకూ హైదరాబాద్ నగరంలో ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడి ఇక్కడ వ్యాపారం చేస్తున్నవారే ఎక్కువ. అందులో ఫుడ్ బిజినెస్ హైదరాబ్‌లో మంచి గిరాకీ ఉంది.

Food Lovers

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. రోజంతా కష్టపడేది పట్టెడు కడుపు నింపుకోవడం కోసమే.. బీదా, గొప్ప భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చక్కటి రుచికరమైన ఆహారం తీసుకోవాలనే చూస్తారు. అదీ రుచికరమైన భోజనం తక్కువ ధరకు ఎక్కడ లభిస్తే అక్కడికి జనాలు ఎగబడుతుంటారు. దానికోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంటారు. ఈ మధ్య రుచికరమైన ఫుడ్స్ ఎక్కడ లభిస్తున్నాయో సోషల్ మీడియాలో వెతికి మరీ పట్టుకుంటున్నారు.

ట్రెండ్‌కు తగ్గట్టు చాలా మంది ఫుడ్ బిజినెస్ చేసేవారు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. కస్టమర్ల సంఖ్యను పెంచుకున్నారు. అలా సక్సెస్ అయినవారే ‘మాదాపూర్ కుమారి ఆంటీ ఫుడ్’. హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్య ఈమె చాలా ఫేమస్ అయ్యారు. ఇందుకు కారణం ఆమె అందిస్తున్న రుచికరమైన ఆహారం, తక్కువ ధరల్లో నాన్-వెజ్ భోజనం. చాలా వరకు హైదరాబాద్ నగరంలో ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడి వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువ. అలాంటి వారి ఆకలిని ‘కుమారి ఆంటీ’ తీర్చుతోంది.

మాదాపూర్ కుమారి ఆంటీ భోజనం అంటే భోజన ప్రియులకు విందే.. మంచి రుచికరమైన వంటకాలతో నోరూరించే కుమారి చేతి వంట కోసం ఎంతో దూరాల నుంచి వస్తూ ఉంటారు. తన వంటకాల రుచితోనే కాదు.. కుమారి ఆంటీ ఆదాయం కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నెలకు దాదాపు మూడు లక్షలకు పైగా సంపాదిస్తోంది. వంట చేసే విధానంలో కుమారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం.

ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, బోటీ కర్రీ, తలకాయ కూర ఇలా నాన్ వెజ్ ప్రియులకు కుమారి చేసే వంట నోరూరిస్తుంది. రోజుకి వంద కిలోల చికెన్ వండుతుంది కుమారి. తన దగ్గర ఏ రోజైనా 100 కిలోల చికెన్ కర్రీ వ్యాపారం తప్పక జరుగుతుందని చెబుతుంది. మటన్ రోజుకు 10 కిలోల చొప్పున వండుతుంది.

పండుగరోజుల్లో కూడా కుమారి వ్యాపారం పెద్దగా తగ్గదు. మంచి భోజనాన్ని వెతుక్కుంటూ వచ్చి మరీ కుమారి దగ్గర తిని వెళతారు. అలాగే ఇంటి దగ్గరి వాళ్లకు పార్సిల్స్ పట్టుకుని వెళతారు. ఈ వంద కిలోల చికెన్ కుమారి దగ్గర మూడు గంటల్లోనే అమ్మకం జరిగిపోతుంది. తన ఫుడ్ గురించి వచ్చిన వీడియోస్ ఇప్పటి వరకూ తను చూసుకోలేదట కుమారి.

ఇంత వ్యాపారం చేయడానికి తన తల్లి, భర్త ప్రోత్సాహమే కారణం అంటుంది. వాళ్ళు ధైర్యం చెప్పకపోయి ఉంటే అసలు తను ఇంత వర్క్ చేయలేకపోయేదాన్నని, తనతో పాటు నలుగురికి ఉపాధి కల్పించేంత ఉండేది కాదని చెప్పుకొచ్చింది కుమారి. తన సక్సస్ వెనుక కుటుంబం ఇచ్చిన భరోసా చాలా ఉంది అంది.

Updated Date - Jan 25 , 2024 | 03:32 PM

Advertising
Advertising