Protein Content : హై ప్రోటీన్స్ ఉన్న ఇండియన్ బ్రేక్ ఫాస్ట్స్ గురించి తెలుసా..!
ABN, Publish Date - Feb 02 , 2024 | 04:21 PM
రోజు మొదటి భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఉదయాన్నే అందుతాయి.
రోజుని కాస్త చలాకిగా మర్చేందుకు హై ప్రోటీన్ అల్పాహారం ఎంచుకోవాలి. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అల్పాహారం. దీనిని దాటవేయడం ఎంత పెద్ద తప్పో, సరైన అల్పాహారం తీసుకోవడం కూడా అంతే కీలకం అనడంలో సందేహం లేదు. రోజు మొదటి భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఉదయాన్నే అందుతాయి. ఇందులో ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఏవంటే..
మొలకెత్తిన గింజలు.. మొలకెత్తిన గింజలతో సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. రోజులో శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుంది. మొలకలు సలాడ్ రుచికరమైనది మాత్రమే కాదు, రోజువారీ ఆహారంలో ఫైబర్, ప్రోటీన్‌లను అందించడానికి మంచి మార్గం. ఇందులో తేలికపాటి అల్పాహారం కోసం విటమిన్లు, మినరల్స్ కూడా ఉన్నాయి.
పెరసపప్పుతో.. ఈ పప్పుతో చేసిన ఏ వంటకం అయినా శక్తిని పంచుతుంది. ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి.
పనీర్ .. పనీర్ లేదా గుడ్డు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా చేర్చవలసిన ప్రోటీన్ ప్యాక్డ్ డిష్. ఇది రుచిని మెరుగుపరచడానికి కూరగాయలు లేదా అదనపు పచ్చి మిరపకాయలను కలపి చేయడం వల్ల రుచిగా ఉంటుంది. జీలకర్ర, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు వంటి మసాలాలతో కలిపి చేసిన పరాటాలను పెరుగు, పచ్చళ్ళతో తీసుకుంటే మంచి ఫీల్ ఉంటుంది.
ఇది కూడా చదవండి; సూపర్ ఫుడ్ ఆర్టిచోక్‌తో ఈ 5 ప్రయోజనాలున్నాయని తెలుసా..!
డాలియా.. డాలియా అనేది ఎసెన్షియల్ అమైనో ఆమ్లాల మూలం. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డాలియాలో డైటరీ ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే శక్తిని అందించడమే కాకుండా, బరువును తగ్గించడంలో సహకరిస్తుంది.
ఓట్స్.. వోట్స్ ఆరోగ్యకరమైనవి. ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉండటమే కాకుండా ఉడికించడం కూడా చాలా సులభం. ఈ ఆరోగ్యకరమైన సూపర్‌ఫుడ్‌తో అల్పాహారాన్ని ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
సోయా.. సోయా గ్రాన్యుల్స్ సెమోలినా, కూరగాయలకు రుచిని ఆరోగ్యాన్ని ఇస్తుంది. సోయా పాలు, పెరుగు కూడా మంచి ఆదరణ పొందాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Feb 02 , 2024 | 04:21 PM