ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Stomach: ఉసిరిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే కలిగే 5 ప్రయోజల గురించి తెలుసా..!!

ABN, Publish Date - Jan 02 , 2024 | 12:16 PM

ఆయుర్వేదంలో గొప్పగా చెప్పే ఉసిరికి శీతాకాలంలో రోగనిరోధక శక్తిని అందిస్తుందని చెప్పబడింది. ప్రతి రోజూ ఆహారంలో తప్పనిసరి ఉసిరిని తీసుకుంటే ఇది పులుపు, ఘాటు, చేదు, ఆస్ట్రిజెంట్, తీపి రుచిని కలిగి ఉంటుంది.

immunity

చలికాలంలో రోగనిరోధక శక్తి పిల్లల్లో పెద్దల్లో కూడా తక్కువగా ఉంటుంది. దీనితో రకరకాల వ్యాధులు వ్యాపించే అవకాశం చాలా వరకూ ఉంది. ఈ పరిస్థితిని దాటాలంటే పోషకాలతో నిండిన ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఈ కాలంలో ముఖ్యంగా పచ్చని ఆకు కూరలతో పాటు, పండ్లు, ఔషధ గుణాలున్న కొన్ని ఆహారపదార్థాలను కూడా తీసుకోవాలి. అందులో ముందుగా చెప్పుకునే ఉసిరి వల్ల చాలా రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. దీనితో కలిగే ప్రయోజనాలేమిటంటే..

ఆయుర్వేదంలో గొప్పగా చెప్పే ఉసిరికి శీతాకాలంలో రోగనిరోధక శక్తిని ఉన్నదని చెప్పబడింది. ప్రతి రోజూ ఆహారంలో తప్పనిసరి ఉసిరిని తీసుకుంటే ఇది పులుపు, ఘాటు, చేదు, ఆస్ట్రిజెంట్, తీపి రుచిని కలిగి ఉంటుంది. ఈ ఉసిరిని ఊరగాయ రూపంలోనూ, మురబ్బాగా తీసుకోవచ్చు. పొడిగా, రసంగా ఇలా చాలా రకాలుగా ఉసిరి మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఇది దంతాలకు కూడా దృఢత్వాన్ని ఇస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం ఉసిరి మూడు దోషాలను నివారించగలదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దక లక్షణాలను తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉబ్బరం కూడా ఉసిరితో తగ్గుతుంది. గుండెను బలపరుస్తుంది. కళ్లకు కూడా ఉసిరి మంచి ఔషదంగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలలోనూ ఉసిరి మంచి గుణాలను చూపుతుంది.

ఉసిరిని తీసుకోవడం ఎలాగంటే...

1. ఉసిరికాయ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఉసిరిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోజంతా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహకరిస్తుంది. టీస్పూన్ ఉసిరి రసాన్ని సగం గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి.

2. ఉసిరి పొడి..

ఉసిరికాయను తక్కువ ఉష్ణోగ్రల మధ్య ఎండబెట్టి ఆ పొడిని తీసుకుంటే శరీరానికి మంచిది. దీనిని ఒక టీస్పూన్ ఉసిరి పొడిని తేనెలో లేదా గోరువెచ్చని నీటినలో కలిపి పరగడపునే తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ కాలేయ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు..!!


3. ఉసిరికాయ పచ్చడి..

ఉసిరికాయతో చేసే ఊరగాయ అన్నం, చపాతీలలోకి కూడా రుచిగా బావుంటుంది. టేబుల్ స్పూన్ ఆవాల నూనెలో కొద్దిగా ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలిపి ఉసిరికాయ ముక్కల్లో కలిపి రెండురోజుల తర్వాత తీసుకుంటే.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఉసిరి మిఠాయి...

భోజనం తర్వాత రోజూ ఉసిరికాయ తీపి ముక్కలను తింటే రుచిగా బావుంటుంది. ఉసిరికాయ ముక్కలను ఎండబెట్టి ఆరిన తర్వాత పంచదార పాకంలో ఉడికించి తీసి ఆరనిచ్చి తింటే రుచిగా, జీర్ణానికి మేలు చేస్తుంది.

ఉసిరితో తీపి మురబ్బాను కూడా తయారు చేస్తారు. ఇది కూడా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణ ప్రయోజనాలకు, క్రోమియం, జింక్, రాగి, ఐరన్‌లకు ఉసిరి మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులకు మంచి ప్రయోజన కరంగా పనిచేస్తుంది. విటమిన్ సి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 02 , 2024 | 12:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising