ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fennel Seeds: సోంపు గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయంటే.. !

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:24 PM

ఈ సోంపును తరచుగా భోజనం తర్వాత రిఫ్రెష్ కోసం తింటూ ఉంటారు. ఈ చిన్నగింజలు మంచి వాసన మాత్రమే కాకుండా సూపర్‌ఫుడ్ గా కూడా పనిచేస్తాయి.

health

మన వంటగదిలో ఉండే మసాలా దినుసు, కిళ్ళీల్లో తప్పక దీనికీ స్థానం ఉంటుంది. అంతేనా జీర్ణక్రియకు సోంపు మంచి పోషకంగా చెబుతారు. అయితే సోంపు గింజలతో చాలా ప్రయోజనాలున్నాయి. ఈ సోంపును తరచుగా భోజనం తర్వాత రిఫ్రెష్ కోసం తింటూ ఉంటారు. ఈ చిన్నగింజలు మంచి వాసన మాత్రమే కాకుండా సూపర్‌ఫుడ్ గా కూడా పనిచేస్తాయి. సోంపు గింజలతో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు

సోంపు గింజలతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత సోంపును తింటే జీర్ణం త్వరగా అవుతుంది. గ్యాస్ ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చెస్తుంది. కడుపు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు:

సోంపు గింజల్లో క్వెర్సెటిన్, కెంప్‌ఫెరోల్‌తో సహా యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ను, ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

శ్వాసకోశ ఇబ్బంది :

సోంపు గింజలు శ్వాసకోశ ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఎక్స్‌పెక్టరెంట్ గుణాలతో ఉన్న ఈ గింజలు శ్లేష్మం, కఫాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. సోపు గింజలతో కలిపిన ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ నివారణ లభిస్తుంది, దగ్గు, బ్రోన్కైటిస్ నుండి ఉపశమనం ఉంటుంది.

ఇది కూడా చదవండి: శీతాకాలపు పొడి దగ్గు, ముక్కు కారటం చికిత్సకు 6 ఇంటి నివారణలు ఇవే.. !


హార్మోన్లు :

సోంపు గింజలు ఈస్ట్రోజెనిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇది హార్మోన్ల సమతుల్యతకు దోహదం చేస్తుంది. PMS, లక్షణాలను, పిరియడ్స్ సమయంలో చికాకును తగ్గిస్తుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులను తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు :

బరువు తగ్గాలంటే ఈ సోంపు గింజలు సహాయపడతాయి. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే ఈ గింజలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 12 , 2024 | 12:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising