Golden Milk : గోల్డెన్ మిల్క్ తీసుకుంటున్నారా.. ఈ పాలను తాగితే ఎన్ని అద్భుత ఫలితాలంటే..!!
ABN, Publish Date - Jan 26 , 2024 | 11:59 AM
గోల్డెన్ మిల్క్ మెదడుకు కూడా మంచిది. పసుపులో ఉండే.. కర్కుమిన్ మెదడులో ఉత్పన్నమయ్యే.. న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జలుబు, దగ్గు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు మన ఇంట్లో వాడే సహజ పదార్థాలతోనే పసుపు పాలను తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పాలు మంచి రిలీఫ్‌ని ఇస్తాయి. ఈ పసుపు పాలనే గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. గోల్డెన్ మిల్క్ రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పసుపులోని విటమిన్లు, మినరల్స్, మాంగనీస్, ఇనుము, పీచు, విటమిన్ బి6, కాపర్, పోటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా ఈ పాలతో ఎన్ని ప్రయోజనాలంటే..
గ్లాసు పాలలో, మిరియాలు, యాలకులు,చిన్న అల్లం ముక్క, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, పావు చెంచా నెయ్యి, పాలు బాగా మరిగాకా, అందులో ఈ దినుసులన్నీ వేసి మళ్ళీ కాసేపు మరగనివ్వాలి. స్టవ్ మీద నుంచి దింపి పాలను పడగట్టి చల్లారకమునుపే తీసుకోవాలి. ఇందులోని ఔషద గుణాల వల్ల జలుబు, దగ్గు సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
యాంటీఆక్సిడెంట్స్..
పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణాల నష్టంతో పోరాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇవి మన కణాల పనితీరుకు చాలా అవసరం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధయనాలు చెబుతున్నారు. గోల్డెన్ మిల్క్‌లో ఉండే.. దాల్చిన చెక్క, అల్లంలోనూ.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి.
కీళ్లు నొప్పులు..
గోల్డెన్ మిల్క్‌లోని పదార్థాలకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అల్లం, దాల్చిన చెక్క, పసుపులోని కర్కుమిన్‌కు యంటీఇన్‌ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి గోల్డెన్ మిల్క్ ఔషధంలా పనిచేస్తుంది. పసుపులో ఉండే.. కర్క్యుమిన్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జ్ఞాపకశక్తి పెంచే పని..
గోల్డెన్ మిల్క్ మెదడుకు కూడా మంచిది. పసుపులో ఉండే.. కర్కుమిన్ మెదడులో ఉత్పన్నమయ్యే.. న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. BDNF మెదడులో కొత్త కనెక్షన్లు ఏర్పరచడానికి సహాయపడుతుంది. మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి, మెదడు బాగా పని చేయడానికి గోల్డెన్ మిల్క్ సహాయపడుతుంది. మతిమరుపు రాకుండా చేస్తుంది.
ఇదికూడా చదవండి: మహిళల్లో సంతోషకరమైన హార్మోన్లను పెంచే శాకాహారాలు ఇవే..!
షుగర్ కంట్రోల్..
గోల్డన్ మిల్క్‌లోని అల్లం, దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని న్యూట్రల్ చేస్తుంది. దాల్చినచెక్కలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో ఉండే.. పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపులో, స్థిరంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. అల్లం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది.
లివర్‌కు..
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలంపాటు వాడే ఔషధాలు కాలేయం మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి వాటి నుంచి గోల్డెన్ మిల్క్ కాపాడుతుంది.
పేగు హెల్త్‌కు..
పసుపులోని యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియలో సహాయపడతాయి. గోరువెచ్చని పాలు, నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల పోషకాల విచ్ఛిన్నం అవుతాయి. శరీరం పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Jan 26 , 2024 | 12:00 PM