High cholesterol: అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గించాలంటే ఆయుర్వేద చిట్కాలివే..!
ABN, Publish Date - Feb 01 , 2024 | 06:23 PM
వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలను కలిగి ఉంది. వెల్లుల్లిని సహజంగా మన వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం.
అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గించడానికి.. ఇంట్లోనే సహజంగా అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే 10 ఆయుర్వేద చిట్కాలు ఇవి.
వెల్లుల్లి..
వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలను కలిగి ఉంది. సహజంగా మన వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. వంటల్లో , సలాడ్స్ లో ఎక్కువగా తినే వెల్లిల్లిలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
అల్లం..
అల్లం ఆయుర్వేద మూలికగా ప్రసిద్ధి పొందింది. ప్రతి ఇంటిలోనూ అల్లం కచ్చితంగా వాడకంలో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి అల్లం ముఖ్యంగా పనిచేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. ఆహారంలో అల్లం తీసుకోవడం అల్లం టీ తాగడం కూడా కఫాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది.
పసుపు..
పసుపులోని యాంటీ కర్కుమిన్ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పనిచేస్తుంది. హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా పసుపు సహకరిస్తుంది.
మెంతి..
మెంతులు నీరు ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుగ్గుల్ అనేది ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే రెసిన్. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది.
త్రిఫల..
త్రిఫల అనేది ఆయుర్వేద మూలిక. ఇందులో మూడు పండ్లు ఉంటాయి. ఉసిరి, కరక్కాయ, తానికాయ ఈ మూడు కలిపి తీసుకోవడం వల్ల రక్కతంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అశ్వగంధ..
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు ప్రధాన కారణం ఒత్తిడి. రోజువారీ ఆహారంలో అశ్వగంధను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీనితో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి: చలికాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!
ధ్యానం..
కొలెస్ట్రాల్ స్థాయిలను, ఒత్తిడి, చెడు LDLస్థాయిలను నియంత్రించడానికి ధ్యానం మంచిది. ఇది ఈ పరిస్థితులను మెరుగుపరుస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం..
వారానికి కనీసం 150 నిమిషాల మోడరేట్ ఇంటెన్సిటీ ఏరోబిక్ యాక్టివీటి లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం శరీరానికి ఉండాలి.
బరువు..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చేయాల్సిన మొదటి పని ఆహారంలో, వ్యాయామంలో మార్పు. కొవ్వు పదార్థాలను మినహాయించి ఆహారాన్ని ఫ్లాన్ చేయాలి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Feb 01 , 2024 | 06:42 PM