Kidneys Health : కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 అలవాట్లు ఇవే..!
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:02 AM
మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించడానికి ఆహారంలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని చెడు అలవాట్లను కూడా వదులుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
మూత్రపిండాల వైఫల్యాన్ని నివారించడానికి ఆహారంలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని చెడు అలవాట్లను కూడా వదులుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలతో పాటు, తక్కువ కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులు, తక్కువ ఉప్పు, చక్కెర, వేయించిన ఆహార పదార్థాలను పరిమిత పరిధిలో తీసుకోవాలి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకుందాం.
చురుకైన జీవనశైలి..
ప్రతి రోజూ 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు చురుకుగా వ్యాయామం చేయాలి. నడక, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్ లేదా స్పోర్ట్స్ ఆడటం వంటి వ్యాయామాలతో శరీరం ఆరోగ్యంగా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
ధూమపానం మానుకోవాలి.
ధూమపానం లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను తీసుకునే అలవాటు ఉంటే తక్షణం మానుకోవాలి. మితిమీరిన ఆల్కహాల్ కూడా రక్తపోటు పెరిగేందుకు కారణం అవుతుంది. మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ పది ఆహారాలు 'డోపమైన్' హార్మోన్‌ను పెంచుతాయట.. !
దీర్ఘకాలిక వ్యాధులు..
మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నట్లయితే మూత్రపిండాలు దెబ్బతినకుండా రక్షించడానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమంలో ఉంచాలి.
ఒత్తిడి..
ఒత్తిడిని తగ్గించుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం మానసిక, శరీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శారీరక శ్రమ ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ధ్యానం వంటివి చేయడం వల్ల మనస్సు, శరీరం రెండూ ప్రశాంతతను పొందుతాయి.
ఇలా కొన్ని అలవాట్లను చేసుకోవడం, మరికొన్ని చెడు అలవాట్లను వదులుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ, శరీరాన్ని ఫిట్ గా ఉంచే విధంగా వ్యాయామాన్ని చేయడం వల్ల చాలా వరకూ కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Jan 18 , 2024 | 11:02 AM