Mood-related issues: ఐరన్ నుండి విటమిన్ సి వరకూ పోషకాహార లోపంతో కలిగే రుగ్మతలు ఎలా ఉంటాయంటే..!
ABN, Publish Date - Jan 06 , 2024 | 11:45 AM
మెగ్నీషియం నరాల పనితీరు, మెదడు రసాయనాల నియంత్రణకు అవసరమైంది. ఇది లోపిస్తే ఆందోళన, నిరాశ భావాలను కలిగిస్తుంది.
అస్తమానూ కోపం వచ్చేస్తుందా? మాట మాటకూ పొంతన లేకుండా పోతుందా? విపరీతమైన ఆలోచనలు, చేయాలనుకున్న పనులు అన్నీ గందరగోళంలో పడిపోతున్నాయా.. ఇదంతా మూడ్ స్వింగ్స్ వల్ల కావచ్చు. పోషకాహారలోపం కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. శరీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసిక ఆరోగ్యం అదే ఉంటుంది. ఇందులో ఏది సరిగా లేకపోయినా కూడా మానసిక ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రతికూల ప్రభావం పడుతుంది.
పోషకాహార లోపాలు మానసిక స్థితికి సంబంధించిన సమస్యలకు కారణం అవుతాయి. మానసిక శ్రేయస్సుకోసం అవసరమైన కీలక పోషకాలను తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించిన శ్రద్ధ అవసరం. అయితే తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు తీసుకుంటున్నామా అనే అవగాహన ప్రతి ఒక్కరికీ కావాలి. లేదంటే శరీరంలో కలిగే మానసిక అనారోగ్యాలకి ఇదే పెద్ద కారణం అవుతుంది. మనలో కలిగే పోషకాహార లోపంతో కలిగే సమస్యలు ఎలా ఉంటాయంటే..
మూడ్ స్వింగ్స్‌కు కారణమయ్యే పోషకాహార లోపాలు..
విటమిన్ డి లోపం
డిప్రెషన్
మాట్లాడితే చిరాకు, ఒంటరిగా ఉండటం, నలుగురిలో కలవాలని అనుకోకపోవడం, ప్రశాంతగా లేకపోవడం, దుఃఖం ఇలాంటి పరిస్థితికి విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం
డిప్రెషన్, యాంగ్జైటీ
మెదడు ఆరోగ్యం EPA , DHA వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లపై ఆధారపడి ఉంటుంది, ఇవి తరచుగా మూడ్ డిజార్డర్స్ తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్ బి లోపం (B6, B9, B12)
డిప్రెషన్, యాంగ్జయిటీ
సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని మూడ్ కంట్రోల్‌కి అవసరమైన B విటమిన్లు (B6, B9, B12) బాగా ప్రభావితం చేస్తాయి.
మెగ్నీషియం లోపం
డిప్రెషన్, ఆందోళన
మెగ్నీషియం నరాల పనితీరు, మెదడు రసాయనాల నియంత్రణకు అవసరమైంది. ఇది లోపిస్తే ఆందోళన, నిరాశ భావాలను కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: బ్రోకలీ తీసుకోవడం వల్ల కలిగే ఐదు ఆరోగ్యప్రయోజనాలు ఇవే..!
ఐరన్ లోపం
అలసట, అసహనం
శరీరానికి ఆక్సిజన్ సరఫరా కోసం ఇనుము అవసరం. ఇనుము లోటు అలసట, చికాకు కలిగిస్తుంది, ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.
జింక్‌లో లోపం
డిప్రెషన్
జింక్ న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు, నాడీ వ్యవస్థ పనులను నియంత్రిస్తుంది. తక్కువ జింక్ స్థాయిలు నిరాశకు దారితీస్తాయి.
విటమిన్ సి లోపం
అలసిపోయినట్లు, చికాకు కలిగించే
విటమిన్ సి లోపం వల్ల అలసట, చికాకు ఏర్పడుతుంది, ఇది మెదడు రసాయనాల నిర్మాణానికి, శరీరం ప్రతిచర్యను నియంత్రించడానికి అవసరం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Jan 06 , 2024 | 12:00 PM