Kidney Stones: మూత్రపిండాల్లోని రాళ్ళుకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:05 PM
కిడ్నీ రాళ్లలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. కాల్షియం రాళ్లు అనేవి సర్వ సాధరణం.. కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అధిక కాల్షియం, ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
యూరినరీ స్టోన్ వ్యాధి ఒక సాధారణ సమస్య.. ఈ వ్యాధి మన జనాభాలో 12శాతం వరకూ ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధికి సరైన చికిత్స అందకపోతే వైఫల్యానికి దారితీస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. ఒకవేళ రాళ్లు ఏర్పడి పరిస్థితి శస్త్రచికిత్సవరకూ వస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం తెలుసుకుందాం.
మూత్రపిండాల్లోని రాళ్లు..
మూత్రంలో కాల్షియం, ఆక్సలైట్ మొదలైన పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్ఫడకుండా నిరోధించాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అలాగే కొన్ని ఆహారాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. జన్యువులు, పర్యావరణం, శరీర బరువు, ద్రవాలు తీసుకోవడం.. వంటివి కారణం అవుతాయి.
మూత్రపిండాల్లో రాళ్లు.. రకాలు
కిడ్నీ రాళ్లలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. కాల్షియం, ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అధిక కాల్షియం, ఆక్సలేట్ విసర్జన వలన మొదలవుతాయి. కాల్షియం ఫాస్ఫేట్ రాళ్లు అధిక మూత్రం కాల్షియం, ఆల్కలీన్ మూత్రం కలయిక వలన ఏర్పడతాయి. మూత్రం ఆమ్లంగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడతాయి. ప్యూరిన్‌లతో కూడిన ఆహారం, జంతు ప్రోటీన్‌లో లభించే పదార్థాలు, యూరిక్ యాసిడ్‌ను పెంచవచ్చు, ఇది స్థిరపడి రాయిలా ఏర్పడుతుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్ల వల్ల స్ట్రువైట్ రాళ్లు ఏర్పడతాయి.
సిస్టీన్ స్టోన్స్ జన్యుపరమైన రుగ్మత వలన ఏర్పడతాయి, దీని వలన మూత్రపిండాల ద్వారా మూత్రంలోకి సిస్టీన్ లీక్ అవుతుంది, రాళ్ళుగా పేరుకుపోయి, స్ఫటికాలను ఏర్పరుస్తుంది.
ఇది కూడా చదవండి: పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా..!
నివారణ చర్యాలు..
రాళ్లను నివారించడంలో ముఖ్యమైన దశ. ఒక వ్యక్తి రోజుకు 2.5 - 3 లీటర్ల ద్రవాన్ని త్రాగాలి. కిడ్నీలో రాయి ఉన్నవారు రోజుకు కనీసం 1.5 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి తగినంత ద్రవ పదార్థాలను త్రాగాలి. యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడే వ్యక్తులు మాంసాహారాన్ని తగ్గించి తీసుకోవాలి.
వైద్యం
ఇది సాధారణంగా 6mm కంటే తక్కువ పరిమాణంలో ఉన్న చిన్న రాళ్లలో మాత్రమే సాధ్యమవుతుంది. మందులు మూత్ర నాళాన్ని విస్తరించి.. రాళ్లను తొలగించేలా చేస్తాయి.
శస్త్రచికిత్స..
మూత్ర నాళంలో 2 సెంటీమీటర్ల వరకు ఉండే రాళ్లను సాధారణంగా యూరిటెరోస్కోపీ (URS) ద్వారా చికిత్స చేస్తారు. ఒక చిన్న స్కోప్ రంధ్రం ద్వారా మూత్ర నాళంలోకి ఉంచుతారు. రాయి లేజర్‌తో విరిగిచి.. మూడు వారాలపాటు స్టెంట్ వేస్తారు. ఇది అనస్థీషియా కింద ఒకే రోజు ప్రక్రియ.
లక్షణాలు
మూత్రపిండాల్లో రాయి మూత్ర నాళంలోకి దిగినప్పుడు, నొప్పి పొత్తికడుపులో ఏర్పడుతుంది. మూత్రపిండ, మూత్రాశయ కోలిక్ తీవ్రంగా నొప్పి ఉంటుంది. రాయి మూత్రాశయం వద్దకు చేరినపుడు, పొత్తి కడుపులో నొప్పి, మూత్ర విసర్జన, ఫ్రీక్వెన్సీ, డైసూరియా ఉంటాయి. మూత్రంలో రక్తం ఉండటం, వికారం, వాంతులు కూడా ఉండవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Feb 02 , 2024 | 12:09 PM