Magnesium Deficiency : మెగ్నీషియం లోపం కలిగితే ఇన్ని కష్టాలా...
ABN, Publish Date - Feb 03 , 2024 | 01:07 PM
క్రమరహిత హృదయ స్పందన మెగ్నీషియం స్థిరమైన హృదయ స్పందనకు కారణం అవుతుంది. మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే
శరీరంలో ఏ విటమిన్ లోపం కలిగినా అది చర్మం ద్వారా లేదా ఇతర శరీర లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరక విధుల్లో కీలకమైనది. ముఖ్యంగా మెగ్నీషియం తక్కువ అయితే శరీరానికి అలసట కండరాల తిమ్మిరి, గుండె లయలో తేడాలు, బలహీనంగా ఉండటం, వికారం వంటి లక్షణాలు బయటపడతాయి. దీనిని పూరించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మెగ్నీషియ లోపంతో వచ్చే పరిస్థితులు దీనికి తీసుకోవాల్సిన ఆహారం వంటి వాటిని తీసుకోవాలి. వీటితో పాటు తెలుసుకోవాల్సిన కీలకమైన సూచనలు.
కండరాల తిమ్మిరి..
మెగ్నీషియం సరైన కండరాల పనితీరు కీలకమైనది. లోపం ఉన్నదని శరీరానికి అందించే సంకేతాలలో ముఖ్యంగా కండరాల తిమ్మిరి ఉంటుంది. కండరాల బిగుతు లేదా మెలితిప్పినట్లు ఉన్నట్లయితే, మెగ్నీషియం తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే..
అలసట, బలహీనత..
ఈ రసాయన మూలకం శరీరంలో శక్తి ఉత్పత్తిలో పాల్గొంటుంది. మెగ్నీషియం లేకపోవడం వల్ల అలసట, బలహీనతకు దారితీస్తుంది. నీరసంగా అనిపిస్తే లేదా రోజువారీ కార్యకలాపాలు చేయడం సవాలుగా అనిపిస్తే, మెగ్నీషియం లోపం ఉన్నట్లే..
ఇది కూడా చదవండి: హై ప్రోటీన్స్ ఉన్న ఇండియన్ బ్రేక్ ఫాస్ట్స్ గురించి తెలుసా..!
క్రమరహిత హృదయ స్పందన..
మెగ్నీషియం స్థిరమైన హృదయ స్పందనకు బాధ్యత వహిస్తుంది. మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే అరిథ్మియా లేదా క్రమరహిత హృదయ స్పందనలకు దారితీస్తుంది. గుండె దడ లేదా అసమానతలు గమనించినట్లయితే, ముందుగా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
వికారం..
వికారం, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ సమస్యలు మెగ్నీషియం లోపంతో ముడిపడి ఉంటాయి. ఈ ఖనిజం జీర్ణవ్యవస్థ పనితీరులో పాల్గొంటుంది. మెగ్నీషియం లేకపోవడం సాధారణ జీర్ణ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. జీర్ణశయ అసౌకర్యం కలుగుతుంటే, మెగ్నీషియం స్థాయిలను పరీక్ష చేయవలసి ఉంటుంది.
అసాధారణ కాల్షియం స్థాయిలు..
మెగ్నీషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని సరైన నరాల పనితీరుకు పనిచేస్తాయి. ఈ ఖనిజాలలో అసమతుల్యత కండరాల తిమ్మిరి, శరీర విధులు సరిగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఏదైనా చిన్న తేడా కనిపించినా, లక్షణాలు కనిపించినా, శరీరంలో మెగ్నీషియం, కాల్షియం స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Feb 03 , 2024 | 01:11 PM