ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Benefits of Ragi: రాగి సూప్ తీసుకోవడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలు తెలుసా..!

ABN, Publish Date - Jan 26 , 2024 | 02:01 PM

రాగి తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రాగుల నుంచి పోషకాలను నెమ్మదిగా జీర్ణం చేసుకోవడానికి మధుమేహం నియంత్రించడానికి సహకరిస్తుంది.

Ragi gava

రాగి లేదా ఫింగర్ మిల్లెట్ అనేది పోషకాలతో నిండిన తృణధాన్యాలలో ఒకటి. దీనిని సాధారణంగా చాలా మంది తమ ఆహారంలో తీసుకుంటారు. రాగి పిండిని జావగా అల్పాహారంలో తీసుకుంటూ ఉంటారు. దీనిని రకరకాలుగా తీసుకోవచ్చు. దోసలుగా, ఇడ్లీల రూపంలో కూడా తీసుకుంటారు. అయితే వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

పోషకాలు..

ఇందులో కాల్షియం, ఇనుము, భాస్వరం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే రక్తం గడ్డకట్టడాన్ని, శరీర ఆరోగ్యాన్నిపెంచుతాయి.

డైటరీ ఫైబర్ అధికం..

రాగి సూప్ రోజూ తీసుకోవడం వల్ల ఫైబర్ జీర్ణ క్రియను పెంచుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంచి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

గ్లూటెన్ కలిగి ఉంది..

రాగి సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇది గ్లూటెన్ సెన్నిటివిటీతో ఉండి పొట్టసమస్యల్ని తీరుస్తుంది. అవసరమైన పోషకాలను అందించడానికి రాగి సూప్ గ్లూటెన్ ఫ్రీ డైట్‌గా చేర్చుకోవచ్చు.

బ్లడ్ షుగర్ రెగ్యులేషన్..

రాగి తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రాగుల నుంచి పోశకాలను నెమ్మదిగా జీర్ణం చేసుకోవడానికి మధుమేహం నియంత్రించడానికి సహకరిస్తుంది.

ఇది కూడా చదవండి: మహిళా స్ఫూర్తి.. ఆవులతో బిజినెస్.. నెలకు రూ.7లక్షల పైగా సంపాదన..!


బరువు నియంత్రణలో..

రాగి సూప్ రోజూ తీసుకోవడం వల్ల బరువు విషయంలో కూడా మార్పును చూడవచ్చు. ఇందులోన్ కేలరీలు బరువు నియంత్రణలో సహకరిస్తాయి. అలాగే ఆహారంలో రాగులను చేర్చుకోవడం వల్ల తినాలనే కోరిక కూడా నియంత్రణలో ఉంటుంది.

రాగిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు..

రాగిలో ఫినాలిన్ సమ్మేళనాల కారణంగా ఫ్లేవనాయిడ్లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని కణాలను రక్షించడానికి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 26 , 2024 | 02:01 PM

Advertising
Advertising