Blood pressure: రక్తపోటును ఎలా నియంత్రిస్తారు.. ఈ చిట్కాలతో తెలుసుకోండి..!
ABN, Publish Date - Jan 12 , 2024 | 04:15 PM
ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు, గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి. తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
హైపర్ టెన్షన్ అనేది ధమని గోడలపై రక్తాన్ని, బలవంతంగా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి సరైన వ్యాయామం అవసరం.
రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం తప్పకు చేయాలి. ఇది నెమ్మదిగా ఉండాలి. కాకపోతే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.
బరువును అదుపులో ఉంచుకోవాలి. ఇది అంత సులువైన పని కాకపోయినా, కొన్ని కిలోల బరువు తగ్గడం కూడా రక్తపోటు స్థాయిలను చేరుకోవడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: క్యాన్సర్ రోగులు పుట్టగొడుగులను తినమని ఎందుకు సలహా ఇస్తారో తెలుసా..!
ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు, గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి. తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిందే. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులు వంటి అత్యంత పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి.
ధూమపానం ఇది ఆరోగ్యానికి హాని కలిగించే చెడు అలవాటు. ధూమపానం రక్తపోటు స్థాయిలను పెంచుతుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటమే మంచిది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)
Updated Date - Jan 12 , 2024 | 04:15 PM