ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yellow Teeth: ఇలా చేసి పసుపు పళ్లను వదిలించుకోవచ్చు.. ట్రై చేసి చూడండి..

ABN, Publish Date - Jan 27 , 2024 | 11:07 AM

పచ్చబడ్డ దంతాలు తెల్లగా మారాలని విశ్వప్రయత్నం చేయడం మామూలే.. దీనికి మరకలను తీసేవేసే అధునాతన పద్దతులను వాడటం, బ్లీచింగ్ ఏజెంట్స్ ఉపయోగించడం కూడా దంతాలను పాడు చేస్తాయి.

teeth,

దంతాలు తెల్లగా నిగనిగలాడుతూ ఉంటే చాలా ఆత్మవిశ్వాసంతో నవ్వుతారు. ముఖంలోని అందాన్ని తెచ్చేది అందమైన పలువరసే.. నిగనిగలాడే తెల్లని పళ్ళు చూసినపుడు నవ్వు కన్నా పలువరస అందానికే ఫిదా అవుతుంటాం. అవే పళ్లు పసుపు రంగులోకి మారి కనిపిస్తే ఆకర్షణగా ఉండదు సరికదా.. ఇబ్బందిగా అనిపిస్తుంది. కాఫీ, టీల అలవాటు, ధూమపానం, పాన్ నమిలే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా ఈ సమస్యను గమనిస్తూ ఉంటాం. ఈ ఇబ్బంది నుంచి బయట పడాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే.. అవేమిటంటే..

దంత పరిశుభ్రత..

సరైన బ్రషింగ్ పళ్ళు పసుపుపచ్చకు మారకుండా రక్షణ ఇస్తుంది. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌కు మారడం గురించి ఆలోచించాలి. ఇది పై వరుసలో దంతాల ఉపరితల మరకలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు రంగుకు ముఖ్య కారణమైన పళ్లలో చిక్కుకున్న ఆహార కణాలు, బ్యాక్టీరియాను తొలగించడానికి ప్రతిరోజూ రెండు పూటలా బ్రష్ చేయడం మారిచిపోవద్దు..

బలవంతంగా దంతాల తెల్లపు..

పచ్చబడ్డ దంతాలు తెల్లగా మారాలని విశ్వప్రయత్నం చేయడం మామూలే.. దీనికి మరకలను తీసేవేసే అధునాతన పద్దతులను వాడటం, బ్లీచింగ్ ఏజెంట్స్ ఉపయోగించడం కూడా దంతాలను పాడు చేస్తాయి. వాటి మీద ఉండే సున్నితమైన ఎనామెల్ పొర చెడిపోతుంది. ఈ చికిత్సలకు అధిక ధర కూడా పెట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏవంటే...!


సహజమైన పద్దతులు..

కర్ర బొగ్గు..

పూర్వకాలం నుంచి వస్తున్నదంతాల శుభ్రతకు ఉపయోగించే బొగ్గు. ఇది పళ్లకు మెరుపును ఇస్తుంది. యాక్టివేటెడ్ చార్ కోల్ టూత్ పేస్ట్‌ని ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. దంతాలు సున్నింతంగా బ్రష్ చేయడం వల్ల ఎనామెల్ దెబ్బతినకుండా ఉంటుంది.

ఆయిల్ పుల్లింగ్..

ఆయిల్ పుల్లింగ్ అనేది పురాతన ఆయుర్వేద విధానం, ఇది నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది. నోటిలో నూనె స్విష్ చేయడం ద్వారా నోరు శుభ్రపడుతుంది. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల టాక్సిన్స్ తొలగి దంతాలు తెల్లగా మారతాయి.

పానీయాలు, ఆహారాలతో మరకలు..

తెల్లటి దంతాల కోసం కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలి. కాఫీ, టీ, రెడ్ వైన్, పొగాకు వంటివి పళ్ళపై మరకలకు కారణం అవుతాయి. ఈ అలవాట్లకు దూరంగా ఉంటూ, రెండు పూటలా దంతాలను శుభ్రం చేసుకోవడం ద్వారా తెల్లటి దంతాలను చక్కని చిరునవ్వునూ సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 27 , 2024 | 11:37 AM

Advertising
Advertising