Superfood Black Rice : బరువు తగ్గడం నుండి మానసిక అనారోగ్యం వరకు, బియ్యంతో ఈ 5 ప్రయోజనాలను తెలుసుకోండి..!
ABN, Publish Date - Jan 11 , 2024 | 04:37 PM
బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మారుతున్న జీవనశైలితో అధికబరువు, ఊబకాయం సమస్యలు కూడా సాధరణమే అయిపోయాయి. చాలా మందిలో బరువు తగ్గడానికి జిమ్‌కి వెళిపోతే సరిపోతుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆహార విషయంలో కూడా తగిన అవగాహన ఉండాలి. ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఉంటేనే బరువు విషయంలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫుడ్స్‌లో బియ్యం తినడానికి భయపడతుంటాం. ఇందులో బరువు పెరగడం వల్ల తినలేకపోతే వైట్ రైస్ బదులు బ్లాక్ రైస్ తినవచ్చు. బ్లాక్ రైస్ లో ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. బ్లాక్ రైస్ తినడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి.
నల్ల బియ్యంతో 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
యాంటీ ఆక్సిడెంట్లు: బ్లాక్ రైస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని వినియోగం వల్ల గుండె జబ్బులు, కీళ్లనొప్పులు, అల్జీమర్స్ తదితర వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
డయాబెటిక్ వారికి: బ్లాక్ రైస్‌లో ఉండే ఆంథోసైనిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, దీనివల్ల మధుమేహాన్ని అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: విహారానికి వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడి ఫుడ్స్ మిస్ కాకండే... !
బరువు : బ్లాక్ రైస్ తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి ఆరోగ్యంగా ఉంటుంది.
గుండెకు మేలు : నల్ల బియ్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రావు. బ్లాక్ రైస్ పగటిపూట ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
మానసిక వ్యాధి సమస్య : బ్లాక్ రైస్‌లో ఉండే ఆంథోసైనిన్ మానసిక వ్యాధులను నివారిస్తుంది. దీనిని తీసుకోవడం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Updated Date - Jan 11 , 2024 | 04:37 PM