Jasmine Flower : వేసవికి అందాన్ని తెచ్చే మల్లెలు ఎక్కువగా పూయాలంటే మాత్రం...!
ABN, Publish Date - Feb 27 , 2024 | 05:44 PM
జాస్మిన్ తోటలో ఉందంటే అది మొత్తం గార్డెన్ కే అందాన్ని తెస్తుంది. రాత్రిళ్ళు ఒక్క పువ్వు వికసించినా ఆ సువాసన తోటనంతా చుట్టేస్తుంది. వేసవిలో పూచే ఈ మల్లెలను కాస్త పెద్దవిగా, ఎక్కువగా పూయాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక చిట్కాలను పాటించాలి
వేసవి కాలం వచ్చిందంటే మల్లెల సువాసన రాత్రిళ్లు అల్లుకుంటుంది. చక్కని తెల్లని పూల సొగసు ప్రతి మదినీ గుభాళిస్తుంది. చక్కని మల్లెలు కొని తెచ్చుకోవడం కన్నా తోటలో పెంచుకోవాలనే చూస్తారు చాలామంది. కొన్ని పువ్వులు ఆనందాన్ని కలిగిస్తాయి. సువాసనతో పాటు మల్లెలకు ఔషధ విలువ కూడా ఉంది. ఈ పూలనుంచి రసాయనాన్ని తీసి సెంట్లలో ఉపయోగిస్తారు.. భారతదేశంలో జూహీ, మాల్టీ, చమేలీ అని కూడా పిలిచే చాలా రకాల మల్లెలు వేసవిలోనే ఎక్కువగా పూస్తాయి. మన పరిసరాలను స్వర్గపు సారంతో నింపే దాని మత్తు వాసన కారణంగా, మల్లె పువ్వు భారతదేశం అంతటాపేరు పొందాయి. మల్లెపూలను మతపరమైన, వివాహ వేడుకలలో భాగంగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి వారికి మల్లెలను ప్రత్యేకంగా ఎక్కువ పూసేలా సంరక్షించడం ఎలానో తెలీదు. మల్లెల్లో ఎన్నో రకాలు.. వాటిలో..
1. సాధారణ జాస్మిన్
2. అరేబియా జాస్మిన్
3. తెల్ల జాస్మిన్
4. పర్పుల్ జాస్మిన్
5. అడవి జాస్మిన్
6. వింటర్ జాస్మిన్
7. స్పానిష్ జాస్మిన్
8. ఏంజెల్ వింగ్ జాస్మిన్
9. మరుగుజ్జు జాస్మిన్
జాస్మిన్ తోటలో ఉందంటే అది మొత్తం గార్డెన్ కే అందాన్ని తెస్తుంది. రాత్రిళ్ళు ఒక్క పువ్వు వికసించినా ఆ సువాసన తోటనంతా చుట్టేస్తుంది. వేసవిలో పూచే ఈ మల్లెలను కాస్త పెద్దవిగా, ఎక్కువగా పూయాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక చిట్కాలను పాటించాలి. దీనికోసం..
1. జాస్మిన్ పెరగడానికి బాగా ఎండినపోయిన నేల అవసరం. ఇది ఇసుక నేలలో కూడా బాగా పెరుగుతుంది. ఈ నేల మరిన్ని మొక్కలు పెరిగే విధంగా గుల్లగా ఉంటుంది.
2. మొగ్గలు తెల్లగా అందంగా విచ్చుకోవాలంటే మాత్రం క్రమం తప్పకుండా నీరు పెడుతూ ఉండాలి. మల్లె పొదలకు నీరు చాలా అవసరం. అయితే మరీ ఎక్కువగా నీరు పెట్టినా కూడా చేటే.. వేళ్ళకు నీరు ఎక్కువై కుళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి రెండురోజులకు ఒకసారి మాత్రమే నీరు పెట్టాలి.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..
3. మల్లెలు 60 ఎఫ్, లేదా 75 ఎఫ్ మధ్య ఉష్ణోగ్రతలలో మాత్రమే పెరగగలవు., ఇవి తేమతో కూడిన వాతావరణెల పచ్చని ఆకులతో పెరుగుతాయి. తేమ తక్కువగా ఉంటే మల్లెల కాండం, ఆకులు ఎక్కువగా పెరుగుతాయి.
4. సూర్యకాంతి పాక్షిక నీడ ఉన్న ప్రదేశాలలో బాగా పెరుగుతుంది.
5. వడిలిన పూలను, ఎండిన కొమ్మలను కత్తిరించి, పొడి ఆకులను తీసి వేస్తూ ఉండాలి. ప్రతి వారం కత్తిరించే విధంగా ఉంటే వేసవిలో పూత బావుంటుంది.
Updated Date - Feb 29 , 2024 | 12:10 PM