ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Paratha: ఇంట్లో పరోటా తయారు చేసుకుంటున్నారా? మెత్తగా రావడానికి ఈ టిప్స్ ఫాలో అవండి..

ABN, Publish Date - Jan 09 , 2024 | 06:28 PM

చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పరోటాలను తయారు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. పిండి సరైన విధంగా కలపడం నుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటేనే మెత్తటి పరోటాలు సిద్ధమవుతాయి. ఇంట్లోనే మృదువైన పరోటాలను తయారు చేసుకోవడంలో సహాయపడే చిట్కాలను ఒకసారి పరిశీలించండి.

చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పరోటాలను (Parathas) తయారు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. పిండి సరైన విధంగా కలపడం నుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటేనే మెత్తటి పరోటాలు సిద్ధమవుతాయి. ఇంట్లోనే మృదువైన పరోటాలను తయారు చేసుకోవడంలో సహాయపడే చిట్కాలను ఒకసారి పరిశీలించండి (Paratha Making).

ముందుగా పిండిని కలిపడానికి వేడి నీటిని సిద్ధం చేసుకోవాలి. ఒకేసారి కాకుండా పిండిని కలుపుతూ పలు దఫాలుగా నీటిని జోడించాలి.

పిండిని కలుపుతున్నప్పుడు దానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని జోడించాలి. నెయ్యి వెయ్యడం వల్ల పిండిని మృదువుగా మారుస్తుంది. అలాగే మంచి సువాసనను అందిస్తుంది.


ఆ మిశ్రమానికి కాస్త గోరు వెచ్చని పాలను లేదా పెరుగును జోడించండి. ఇలా చేయడం వల్ల కూడా పరోటాలు మెత్తగా వస్తాయి

పిండిని బాగా కలిపిన తర్వాత దానిని తడిగా ఉన్న కాటన్ వస్త్రంలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడే మృదువైన పరోటాలు వస్తాయి.

పిండిని వత్తేటపుడు ఎక్కువ మైదాను ఉపయోగించకండి. స్వల్పంగా ఉపయోగిస్తేనే మంచిది.


పరోటాలను పెద్ద మంటపై కాకుండా తక్కువ నుంచి మధ్యస్థ మంట పైనే కాల్చాలి. అలాగే పరోటాను కాల్చే పెనం మరీ పెద్దది, చిన్నది కాకుండా ఉండాలి.

పరోటాలను కాల్చిన తర్వాత వాటిని నిల్వ చేయడం కూడా ముఖ్యమైన విషయమే. అవసరమైన తేమ ఉండేలా పరోటాలను స్టోర్ చేసుకోవాలి.

Updated Date - Jan 09 , 2024 | 06:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising