ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మీకు తెలుసా?

ABN, Publish Date - Jan 27 , 2024 | 11:36 PM

చూడచక్కని అందం.. పసుపు పచ్చరంగు.. నల్లటి చుక్కల శరీరం.. పక్కన రెక్కలు.. చూడటానికి ఓ పెట్టెలా ఉండే ఈ చేపను ‘ఎల్లో బాక్స్‌ఫిష్‌’ అని పిలుస్తారు.

  • చూడచక్కని అందం.. పసుపు పచ్చరంగు.. నల్లటి చుక్కల శరీరం.. పక్కన రెక్కలు.. చూడటానికి ఓ పెట్టెలా ఉండే ఈ చేపను ‘ఎల్లో బాక్స్‌ఫిష్‌’ అని పిలుస్తారు.

  • పది ఇంచుల నుంచి 24 ఇంచుల పొడవు ఉంటుంది.

  • హిందూ మహాసముద్రం, అరబిక్‌ మహాసముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఇవి కనపడతాయి.

  • నాచు, చిన్న చేపలను తిని బతికే ఈ చేపకు అద్భుతమైన డిఫెన్స్‌ మెకానిజం వీటికి ఉంటుంది.

  • ఆస్టాక్‌టాక్సిన్‌ అనే పదార్థాన్ని వెదజల్లుతుంది. ఇది నీటిలోకి చేరిన తర్వాత విషంగా మారుతుంది. మనిషి లేదా ఏ ఇతర జీవుల రక్తకణాలపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే అందంగా ఉందని దీన్ని తాకినా.. లేక ఈ మాంసాన్ని తిన్నా మనుషులకు ప్రమాదమే మరి.

  • చిన్న నోరు ఉండే ఈ చేపకు ఏమి దొరికినా గుటుక్కున మింగేస్తుంది. ఇంతకీ ఈ చేప ఇలా పెట్టెలా ఉండటానికి కారణం దాని శరీరంలోని ఎముకల నిర్మాణమే కారణం.

  • సాల్ట్‌వాటర్‌లోనే ఉండే ఈ చేపను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అయితే దాని ముట్టుకోవటం చేయకూడదు. కేవలం అందం కోసం ఆక్వేరియంలో పెంచుకోవచ్చు.

  • ఇవి నిదానంగా ఈదుతాయి. అందుకే చూడటానికి అందంగా కనపడతాయి.

  • డైట్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రంలో ఉండే రాళ్లను పళ్లతో పట్టుకుని వేలాడుతుంటాయి.

  • ఇవి పదేళ్ల వరకూ జీవిస్తాయి.

  • మనదేశంలోని లక్ష్యద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, కేరళ తీర ప్రాంతాల్లో కూడా ఈ చేపలు నివసిస్తాయి.

  • మెర్సిడెస్‌ బెంజ్‌కార్‌ ఈ చేప స్ఫూర్తితో బయోనిక్‌ కార్‌ను తయారు చేయటం విశేషం.

  • కొన్ని చేపలకు కొమ్ములు కూడా ఉంటాయి.

  • వయసు పెరిగే కొలదీ వాటికి ఉండే పసుపుపచ్చ రంగు షేడ్‌ తగ్గుతుంది.

Updated Date - Jan 27 , 2024 | 11:36 PM

Advertising
Advertising