ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bali Starling : మీకు తెలుసా?

ABN, Publish Date - Feb 03 , 2024 | 06:11 AM

తెల్లగా, కంటి దగ్గర నీలం రంగులో ఉండే ఈ పక్షి ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో ఉంటుంది. దీన్ని బాలి స్టార్లింగ్‌ అని పిలుస్తారు. దీన్నే జలక్‌ బాలి, బాలి మైనా పేర్లతో కూడా పిలుస్తారు.

  • తెల్లగా, కంటి దగ్గర నీలం రంగులో ఉండే ఈ పక్షి ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో ఉంటుంది. దీన్ని బాలి స్టార్లింగ్‌ అని పిలుస్తారు. దీన్నే జలక్‌ బాలి, బాలి మైనా పేర్లతో కూడా పిలుస్తారు.

  • బ్రిటీష్‌ బర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ స్టార్లింగ్‌ 1911 సంవత్సరంలో ఈ పక్షి గురించి చెప్పాడు కాబట్టి అతని పేరు వచ్చింది.

  • మగ పక్షులు పెద్దగా ఉంటాయి. ఆడపక్షులు చిన్నగా ఉంటాయి. అలా గుర్తించాలంతే. 25 సెం.మీ. పొడవు ఉంటాయివి. రెక్కల పొడవు 52 సెం.మీ. వీటి బరువు 150 గ్రాములు.

  • గింజలు, పండ్లు, పురుగులను తినే ఈ పక్షులు గుంపులుగా ఉంటాయి.

  • వీటి సంఖ్య తక్కువ. అందుకే బాలి జాతీయపార్కులో పెంచుతున్నారు.

  • ఈ అడవి పక్షులను ఎక్కువగా మనుషులే పట్టుకుంటున్నారు. దీని ఫొటోతో ఇండోనేషియాలో నాణేలు కూడా విడుదల అయ్యాయి.

  • ఫ ఇవి అందంగా ఉంటాయి. వీటి తోక అంచులు, మెడ దగ్గర మాత్రమే నల్లగా ఉంటుంది. ఇవి వర్షాకాలంలో మాత్రమే గుడ్లు పెడతాయి. నీలం, ఆకుపచ్చ రంగులో రెండు లేదా మూడు గుడ్లు మాత్రమే పెడతాయి. పదిహేను రోజుల పాటు పొదుగుతాయి.

  • కేవలం వందపక్షులు మాత్రమే 2012 లెక్కల ప్రకారం కనపడటంతో వీటిమీద ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

  • వీటి జీవనకాలం కేవలం ఐదేళ్లు ఉంటుంది.

  • చెట్ల తొర్రల్లో మాత్రమే నివసిస్తాయి. అది కూడా ఇతర పక్షులు వదిలేసిన పాతగూళ్లలో మాత్రమే నివాసం ఏర్పరచుకుంటాయి.

  • ఇవి వేరే ప్రాంతాలకు వెళ్లటానికి ఇష్టపడవు. కేవలం బాలి ప్రాంతంలోనే ఈ పక్షులు కనపడతాయి.

Updated Date - Feb 03 , 2024 | 06:11 AM

Advertising
Advertising