ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Story : పొగరు జింక.. ప్రమాదం!

ABN, Publish Date - Feb 03 , 2024 | 11:53 PM

ఒక అడవిలో ఓ జింక ఉండేది. ఆ జింక అందంగా ఉండేది. దానికి తోడు రెండు కొమ్ములు చెట్ల కొమ్మల్లా ఉండేవి. చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయా కొమ్ములు అని ఇతర జంతువులు అనేవి. దీంతో ఆ జింక కొన్నాళ్లకు ‘నా

ఒక అడవిలో ఓ జింక ఉండేది. ఆ జింక అందంగా ఉండేది. దానికి తోడు రెండు కొమ్ములు చెట్ల కొమ్మల్లా ఉండేవి. చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయా కొమ్ములు అని ఇతర జంతువులు అనేవి. దీంతో ఆ జింక కొన్నాళ్లకు ‘నా లాంటి అంమైన జింకలే లేవు’ అని అనుకునేది. ఆ తర్వాత తన లాంటి అందమైన కొమ్ములు మరెవరికీ లేవని రూఢీ చేసుకుంది. దీంతో అతి నమ్మకం కాస్త పొగరుగా మారింది. తన లాంటి కొమ్ములు ప్రపంచంలోనే ఎవరికీ ఉండవని భ్రమతో ఉండేది. ఆ గర్వంతోనే తాను మరింత గొప్పదాన్నని. దైవ స్వరూపంలా భావించేది.

ఒక రోజు ఉదయాన్నే సూర్యోదయం అయ్యాక ఒక సరస్సు దగ్గరకు వచ్చింది. అక్కడి నీళ్లు శుభ్రంగా ఉన్నాయి. దీంతో ఆ నీళ్లను తాగటానికి వెళ్లింది. తన శరీరంతో పాటు కొమ్ములు నీటిలో నీడలా కనపడ్డాయి. మరింత పొంగిపోయింది. కొమ్ములంటే నావే.. అనుకుంది. ఈ చిన్న కాళ్లు ఉపయోగం లేదు.. సన్నగా ఉన్నవి అనుకుంది. కొమ్ములే అందం.. కాళ్లు విహీనం అనుకుంది. క్షణాల్లో తన వెనుకల ఓ పులి ఉందనే విషయం అర్థం చేసుకుంది. చెంగుమని ఎగిరి అక్కడి నుంచి పారిపోయింది. సన్నని కాళ్ల వలన జింక వేగంగా పరిగెత్తింది. పులి కూడా వెంటనే పరిగెత్తింది.

అడవిలోకి వెళ్తూనే పులికి కనపడలేదు. జింక జాడను పులి కనుక్కుని వేగంగా పరిగెత్తింది. దీంతో దట్టమైన అడవిలోకి జింక పరిగెత్తింది. తన కాళ్ల గొప్పతనమేంటో పులికి తెలీదు కాబోలు అనుకుంది. ఎదురుగా చూస్తే చెట్లు. కొమ్ములు అడ్డొస్తున్నాయి. దీంతో ఎంత పరిగెత్తినా కొమ్ములకు చెట్లు అడ్డువస్తున్నాయి. జింకకు ఆయాసం వచ్చింది. జింకలా పరిగెత్తటం కష్టం. దాని కాళ్లులా నాకూ ఉంటే అనుకుంది పులి. అయితే జింక తన అందమైన కొమ్ములు పోతే ఎలా? అనుకుంది. జాగ్రత్తగా అడవిలో పరిగెత్తుతోంది. దీంతో పులికి చిక్కింది. పులి మీద పడిన తర్వాత జింకకు అర్థమైంది ఓ విషయం. ‘ కొమ్ములు బావున్నాయని విర్రవీగాను. కాళ్లు సన్నగా ఉన్నాయి కాబట్టి ఇంత సమయం పరిగెత్తాను’ అనుకుంది. ఆ క్షణంలో తన కొమ్ములు ఉపయోగం లేదని చెప్పినా.. ఉపయోగం లేదు. కొమ్ములు ఉన్నందుకు గర్వంగా ఉన్నాను. కొమ్ములే లేకపోతే ఈ ప్రాణాలు దక్కేవి అనుకుంది మనసులో.

నీతి- ఏది మంచో, ఏది చెడో గుర్తించటమే విజయం.’

Updated Date - Feb 03 , 2024 | 11:53 PM

Advertising
Advertising