ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పిల్లి మెడకు గంట కట్టేదెవరూ?

ABN, Publish Date - Jan 17 , 2024 | 03:08 AM

ఒక ఊరిలో నక్షత్రకుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను పట్టిందే బంగారం. ఏ వ్యాపారం చేసినా కలిసొచ్చేది. కిరాణా సామాన్లుకు సంబంధించిన వ్యాపారాలు చేసి ధనం గడించాడు. అతనికి తీపి పదార్థాలుండే దుకాణం

ఒక ఊరిలో నక్షత్రకుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను పట్టిందే బంగారం. ఏ వ్యాపారం చేసినా కలిసొచ్చేది. కిరాణా సామాన్లుకు సంబంధించిన వ్యాపారాలు చేసి ధనం గడించాడు. అతనికి తీపి పదార్థాలుండే దుకాణం పెట్టాలని ఎప్పటినుంచో కోరిక ఉండేది. తన వృద్ధాప్యంలో తీపి పదార్థాల దుకాణం పెట్టాడు. ఆ వ్యాపారం బాగా సాగుతోంది. ముఖ్యంగా నేతి మిఠాయిలు, నేతి లడ్డూలు.. లాంటి తీపి పదార్థాలకు ఆ దుకాణం పేరుగాంచింది.

ఒక రోజు దుకాణం మూసేసేటప్పుడు ఎలుకల చప్పుడు వినిపించింది వ్యాపారికి. పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఎలుకల గుంపు ఎక్కువయి కొట్టులో ఉండే తిండిని అంతా పాడుచేస్తున్నాయి. ఏమి చేయాలో పాలు పోక ఆ వ్యాపారి తన మిత్రుడికి మొరపెట్టుకున్నాడు. ‘పిల్లి తీసుకువస్తే సరి’ అన్నాడు తన మిత్రుడు. ఓ గండు పిల్లిని తీసుకొచ్చాడు వ్యాపారి. ఆ పిల్లి అరుపులతో ఎలుకలు కనపడకుండా పోయాయి.

ఆ తర్వాత ఎలుకలను చంపి పడేసేది పిల్లి. చూస్తుండగానే ఎలుకలన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. ఎక్కడ ఉన్నా ఎలుకను పట్టుకునేది పిల్లి. బయటికి రాలేక ఆకలితో లోపలే ఉండిపోయేవి. బయటికి వస్తే మాత్రం ప్రాణాలు పోగొట్టుకునేవి. ఇక చావు తప్పదా? అంటూ కొన్ని ఎలుకలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరి బాధ వారిది. ఆ పిల్లిని తరిమి కొట్టాలి లేదా అది వస్తోందని మనకు ముందే తెలియాలి.. మార్గం ఉంటే చెప్పమని మాట్లాడుకున్నాయి. వాటిలో ముసలి ఎలుక వచ్చి ఇలా అన్నది.. ‘ఆ పిల్లి భయపడదు. దాన్ని గెంటేయలేం. అయితే దాని రాకను పసిగట్టొచ్చు. మాయదారి పీడనుంచి మనం రక్షించుకోవచ్చు’ అన్నది. ‘ఏమి చేయాలని?’ ఉత్సాహంతో అడిగాయి ఎలుకలు. ‘ఆ పిల్లి మెడకు గంట కడితే సరి. అది వచ్చేప్పుడు శబ్ధం వినపడుతుంది’ అన్నది పెద్ద ఎలుక. అంతలో పిల్లి వచ్చింది. ముసలి ఎలుక వేగంగా వెళ్లి బొరియలో దాక్కుంది. మిగతా ఎలుకలూ మాయమయ్యాయి. పిల్లి మెడకు గంట కట్టాలనే ఆలోచన ఉన్నా.. ఎవరూ ముందుకు రాలేదు. అలా ఆ కొట్టులో ఎలుకల జాడ మాయమైంది.

Updated Date - Jan 17 , 2024 | 03:08 AM

Advertising
Advertising