ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahashivratri 2024: శివరాత్రికి ముస్తాబుకానున్న ప్రసిద్ధ దేవాలయాలు ఇవే..!

ABN, Publish Date - Mar 06 , 2024 | 01:10 PM

ప్రసిద్ధ హిందూ శివాలయం నీలకంఠ మహాదేవ్ ఆలయం శివుని స్వరూపమైన నీలకంఠుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ ఆలయం శివునికి అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఈ ప్రదేశం నార్ నారాయణ పర్వత శ్రేణుల సమీపంలో దట్టమైన అడవులతో ఉంది. ఈ శివాలయం పంకజ, మధుమతి నదుల సంగమం దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఇది శివరాత్రి ముందురోజు తప్పక సందర్శించవలసిన దేవాలయం.

Mahashivratri 2024

శివరాత్రి (Mahashivratri 2024) మహోత్సవంలో శివుని పూజించి, ఆ దేవ దేవుని ఆశీర్వచనాలు అందుకునే భక్తులు ఎందరో. ఈ పర్వదినాన శివుడుని వివిధ రూపాల్లో పూజిస్తారు. భారతదేశం మొత్తంలో శివునికి అనేక దేవాలయాలున్నాయి. వాటిలో ఈ పర్వదినాన ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయాలకు ప్రత్యేకంగా వెళ్ళాలనుకునే భక్తులు ప్రయాణ సౌకర్యాలున్నాయి. ఆంధ్రా, తెలంగాణాల నుంచి వెళ్ళేందుకు బస్, ట్రైన్ సౌకర్యాలున్నాయి. ప్రత్యేకంగా ఈ ఐదు ప్రసిద్ధ శివాలయాలు గురించి చెప్పుకోవాలంటే..

గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కోసం భారతదేశంలోని టాప్ 5 ప్రసిద్ధ శివాలయాలు..

1. కేదార్నాథ్ ఆలయం

ప్రతి ఒక్కరూ శివరాత్రి పర్వదినాన్ని పండుగగా జరుపుకుంటారు. శివుడు కొలువై ఉన్న కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ కేదార్‌నాథ్ టెంప్ "చర్ధామ్ యాత్ర"లో ప్రధానమైనది. గర్వాల్ హిమాలయ శ్రేణిలో మందాకిని నదికి సమీపంలో ఉన్న ఈ శివాలయం ప్రపంచవ్యాప్తంగా హిందువులలో గొప్ప భక్తి భావనను కలిగిస్తుంది. సుమారుగా 3583 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయంలో శీతాకాలం అంతా మంచు కురుస్తుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ఒక పెద్ద పండుగ జరుగుతుంది.

* రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం ఉంటుంది. కేదార్ నాథ్‌కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రూ.1500 నుంచి 2000 మధ్య ఛార్జ్ చేస్తారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్‌కు రావాల్సిందే.

ఇది కూడా చదవండి: బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!

2. రామనాథస్వామి ఆలయం

రామనాథస్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉన్న శివుని దేవాలయం. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. పాండ్య రాజవంశం సుమారు 12వ శతాబ్దంలో ఈ శివాలయాన్ని నిర్మించింది. భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాలలో కన్నా, ఇది పొడవైన కారిడార్‌తో ఉంది. ప్రతి శివ భక్తుడు తప్పక చూడాల్సిన దేవాలయాల్లో ఒకటి. రామేశ్వరం జ్యోతిర్లింగ ఆలయంలో మహా శివరాత్రి పండుగను పది రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ రోజున దేవతామూర్తులను ఊరేగింపుగా తిరువీధుల్లో ఊరేగిస్తారు.

* మైసూరు నుండి రామనాథస్వామి ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 11-12 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయం మైసూర్ నుండి NH87 మీదుగా 550 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూర్ నుండి గమ్యస్థానానికి నేరుగా రైళ్లు, బస్సులు లేదా విమానాలు లేవు. బెంగుళూరుకు రైలులో ప్రయాణించి రామేశ్వరానికి బస్సు ఎక్కడం ఆలయానికి వెళ్లడానికి చౌకైన మార్గం.

3. కాశీ విశ్వనాథ దేవాలయం

భారతదేశంలోని అత్యంత పూజ్యమైన శివాలయాల్లో ఒకటి, కాశీ విశ్వనాథ్ ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది కూడా పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. 1983 నుండి, ఈ ఆలయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

* నగరంలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అవి వారణాసి కంటోన్మెంట్ స్టేషన్, కాశీ రైల్వే స్టేషన్.

* నగరంలో రెండు బస్ టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి కాంట్, మరొకటి గోల్గడ్డ వద్ద ఉంది, దీనిని సాధారణంగా కాశీ డిపోగా పిలుస్తారు. కాంట్ టెర్మినల్ రెండు డిపోలకు బస్సులను నిర్వహిస్తుంది.


ఇవి కూడా చదవండి:

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

4. నీలకంఠ మహాదేవ్ ఆలయం

ప్రసిద్ధ హిందూ శివాలయం నీలకంఠ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం శివునికి అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఈ ప్రదేశం నార్ నారాయణ పర్వత శ్రేణుల సమీపంలో దట్టమైన అడవులతో ఉంది. ఈ శివాలయం పంకజ, మధుమతి నదుల సంగమం దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఇది శివరాత్రి ముందురోజు తప్పక సందర్శించవలసిన దేవాలయం.

* హరిద్వార్‌లోని స్వర్గ్ ఆశ్రమం పైన ఉన్న కొండపై ఉన్న నీలకంఠ ఆలయానికి ఇక్కడి నుండి ఈ దేవాలయం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రిషికేశ్ నుండి కూడా చేరుకోవచ్చు. ఈ ఆలయానికి వెళ్లే మార్గం చుట్టూ పచ్చని కొండలు, నదులు ఉన్నాయి, చాలా మంది యాత్రికులు ట్రెక్కింగ్ ద్వారా ఈ ఆలయానికి వస్తారు, ఇక్కడికి రిషికేశ్ నుండి 4 గంటల సమయం పడుతుంది.

5. మహేశ్వరం ఆలయం

శివుని నివాసమైన మహేశ్వరం ఆలయంలో మహా శివరాత్రిని ఉత్సాహంతో జరుపుకుంటారు. మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయం అని పిలిచే ఈ ఆలయం సాంప్రదాయ కేరళ నిర్మాణ శైలిలో చెక్క, కృష్ణ రాయిని ఉపయోగించి నిర్మించారు. ఇది డెబ్బై స్తంభాలతో, సున్నితమైన శిల్పాలతో ఉన్నాయి. దీనిని కళ, మత ఔత్సాహికులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

Updated Date - Mar 07 , 2024 | 11:22 AM

Advertising
Advertising