Horoscope: ఈ రాశివారికి దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి..
ABN, Publish Date - Mar 05 , 2024 | 07:09 AM
నేడు (5-3-2024 మంగళవారం) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
నేడు (5-3-2024 మంగళవారం) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న పెద్దల సహకరారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబఽధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల కోసం ఖ ర్చు చేస్తారు. హనమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. అన్నదమ్ముల వ్యవహారశైలిలో మార్పులు గమనిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు, నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Mar 05 , 2024 | 07:13 AM