Viral: చీటింగ్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌పై యువతి వినూత్న రివెంజ్!
ABN, Publish Date - Jan 04 , 2024 | 10:19 PM
ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటూ తనను మోసగించిన బాయ్‌ఫ్రెండ్‌పై ఓ మహిళ వినూత్న రీతిలో రివెంజ్ తీర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటూ తనను మోసగించిన బాయ్‌ఫ్రెండ్‌పై ఓ మహిళ వినూత్న రీతిలో రివెంజ్ తీర్చుకుంది. అతడిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి భారీ నజరానా కూడా రాబట్టుకుంది. అమెరికాలో (USA) వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. బాయ్‌ఫ్రెండ్‌పై తాను ఎలా పగ తీర్చుకుందీ చెబుతూ ఏవా లూయీ అనే కంటెంట్ క్రియేటర్ చేసిన టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
గతంలో తనకు బాయ్‌ఫ్రెండ్ చెప్పిన అంశాల ఆధారంగా ఏవా అతడికి స్పాట్ పెట్టింది. ఓసారి ఏవా బాయ్‌ఫ్రెండ్ తాను ట్యాక్స్ ఎగ్గొట్టిన విషయాన్ని ఆమెకు చెప్పాడు. అతడి మోసం తెలిశాక ఆ సీక్రెట్‌ను బయటపెట్టాలని ఏవా నిర్ణయించుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ పన్ను ఎగ్గొట్టిన విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చెప్పింది (US woman spills beans about boyfriend tax evasion) . దీంతో, ప్రభుత్వం ఆమెకు దాదాపు రూ.83 లక్షల నజరానా ఇచ్చింది.
అమెరికా చట్టాల ప్రకారం, పన్ను ఎగవేతదారుల వివరాలు బట్టబయలు చేసిన వారికి ప్రభుత్వం భారీ నజరానా ఇస్తుంది. అయితే, ఇలాంటి కేసుల్లో ఎగవేసిన రెండు మిలియన్ డాలర్లకు పైబడి ఉండాలి. అలాంటి సందర్భాల్లో అధికారులు రికవరీ చేసిన మొత్తంల్లోంచి సుమారు 15 నుంచి 30 శాతం వరకూ పన్ను ఎగవేత సమాచారం బయటపెట్టిన వారికి చెల్లిస్తారు. కాగా, గతేడాది చైనాలోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ముగ్గురు యువతులు తమను మోసగించిన వ్యక్తి బండారం బయటపెట్టి ప్రభుత్వం ఇచ్చే నజరానాను సొంతం చేసుకున్నారు.
Updated Date - Jan 04 , 2024 | 10:25 PM