BATA: ఘనంగా ముగిసిన 'బాటా'సంక్రాంతి సంబరాలు!
ABN, Publish Date - Jan 29 , 2024 | 02:51 PM
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి.
ఎన్నారై డెస్క్: బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా వంటల పోటీలు, రంగవల్లి ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, బొమ్మల కొలువు, మెలోడీ పాటల పల్లకీ వంటి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సంగీత కచేరీ, క్లాసికల్ డ్యాన్స్ బ్యాలెట్, జానపద నృత్యాలు, వేదికపై గేమ్ షో, డ్యాన్స్‌లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా 30 రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆహూతులు ఆరగించారు. మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమై రాత్రి 10:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఆడిటోరియం మొత్తం సంక్రాంతి పండుగను ప్రతిబింబిస్తూ తెలుగు లోగిళ్లు ఉట్టిపడేలా అలంకరించారు. ప్రధాన వేదికపై మల్టీకలర్ బ్యాక్‌డ్రాప్‌లు, రంగురంగుల గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు, కంటెస్టెంట్లు, బాటా వాలంటీర్ల సంప్రదాయ దుస్తులు, వారి అలంకరణలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి.
ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ హిట్ పాటలకు చిన్న పిల్లలు, BATA యువకులు చేసిన హై ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. శాన్ జోస్, కుపెర్టినో, ఫ్రీమాంట్, శాన్ రామోన్ మొదలైన ప్రదేశాలలో చిన్న పిల్లలకు డ్యాన్స్‌లో శిక్షణను ఇచ్చేందుకు BATA టీమ్ సభ్యులు కష్టపడి పనిచేశారు. అద్భుతమైన విజువల్స్, మేకప్, దుస్తులతో "స్టార్ట్ కెమెరా యాక్షన్" (ఫ్యాషన్ షో) ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఆన్-స్టేజ్ గేమ్ షోలో చాలామంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాపార సంస్థల నుంచి భారీ మద్దతు లభించింది. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ స్పాన్సర్ “సంజయ్ టాక్స్‌ప్రో”,“పవర్డ్ బై” స్పాన్సర్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్య , గోల్డ్ స్పాన్సర్ “శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్” ఇతర స్పాన్సర్‌లు PNG జ్యువెలర్స్, TASQA.AI & Vyzn రియల్టర్లు, మీడియా స్పాన్సర్ 'నమస్తే ఆంధ్ర' వాలంటీర్లు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు BATA అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు. BATA ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆయన పరిచయం చేశారు. శివ కడా, వరుణ్ ముక్క, హరి సన్నిధి, రవి తిరువీదుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి ,సుమంత్ పుసులూరితో కూడిన “స్టీరింగ్ కమిటీ”... శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన “సాంస్కృతిక కమిటీ”, సందీప్ కేదార్ శెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన "లాజిస్టిక్స్ టీమ్", సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సింధూరలతో కూడిన యూత్ కమిటీని ఆయన పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన BATA బృందానికి బాటా “సలహా మండలి” సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు.
Updated Date - Jan 29 , 2024 | 02:51 PM