Summer Tips: వేసవి వచ్చేస్తోంది.. మీ ఇంట్లో ఏసీని ఇలా ఈజీగా క్లీన్ చేయండి..
ABN, Publish Date - Feb 20 , 2024 | 08:12 AM
Air Conditioner Cleaning Tips: చలికాలం దాదాపు ముగిసినట్లే. వేసవి మొదలైంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు.. ఎండ చుక్కలు చూపిస్తోంది. అయితే, ఇంట్లో ఏసీ వాడే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగనప్పటికీ.. ప్రజలు వేసవిని ఫేస్ చేసేందుకు సిద్ధమవ్వాల్సిందే.
Air Conditioner Cleaning Tips: చలికాలం దాదాపు ముగిసినట్లే. వేసవి మొదలైంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు.. ఎండ చుక్కలు చూపిస్తోంది. అయితే, ఇంట్లో ఏసీ(Air Conditioner) వాడే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగనప్పటికీ.. ప్రజలు వేసవిని(Summer) ఫేస్ చేసేందుకు సిద్ధమవ్వాల్సిందే. ఎండ వేడిమిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను బయటకు తీయడం/పునర్వినియోగించడం చేస్తారు. కొందరైతే కొత్త కూలర్, ఏసీలను కొనుగోలు చేస్తారు. మరికొందరు తమ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న కూలర్, ఏసీలను రిపేర్ చేయించి వాడుతారు. అయితే, చాలా మంది వేసవి సీజన్ ముగిసిన తరువాత ఏసీ, కూలర్‌లను వినియోగించడం ఆపేస్తారు. ముఖ్యంగా ఏసీని దాదాపు పక్కకు పెట్టేస్తారనే చెప్పొచ్చు.
ఇప్పుడు వేసవి వచ్చేయడంతో ఇంతకాలం నిరుపయోగంగా పెట్టిన ఏసీని మళ్లీ వినియోగించేందుకు సిద్ధమయ్యారు ప్రజలు. అయితే, ఏసీని వినియోగించడానికి ముందు దానిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలా మంది మెకానిక్‌ను సంప్రదిస్తారు. మెకానిక్ వచ్చి శుభ్రం చేస్తే ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి పని లేకుండా.. రూపాయి కూడా ఖర్చు అవకుండా ఏసీని మనమే శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఏసీని క్లీన్ చేయాలి..
ఏసీ నిర్వహణ చాలా ముఖ్యం. క్లీన్ చేయకపోతే దానిలో పేరుకుపోయిన దుమ్ము.. గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అలాగే, ఫిల్టర్‌పై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల కాయిల్‌పై మంచు పేరుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు.. శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం కూడా ఉంది.
ఇంట్లో ఏసీ క్లీనింగ్..
ఇంట్లో ఏసీని శుభ్రం చేయడానికి ముందుగా ఏసీ స్విచ్ ఆఫ్ చేయాలి. దాని ప్యానెల్‌ను తెరవాలి. ఆ తరువాత ఏసీ ఫిల్టర్లను ఒక్కొక్కటిగా తొలగించాలి. జాగ్రత్తగా ఏసీలోని ఎవాపరేటర్ కాయిల్‌లో పేరుకుపోయిన మురికి, డస్ట్‌ని టూత్ బ్రష్ సహాయంతో శుభ్రం చేయాలి. ఇలా చేసిన తరువాత శుభ్రమైన కాటన్ క్లాత్‌తో ఏసీపై దుమ్మును శుభ్రం చేయాలి. ఫిల్టర్లను సరిగ్గా శుభ్రం చేయడానికి వాటిని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఫిల్టర్లు క్లీన్ అవుతాయి.
ఫిల్టర్లను కడిగిన తరువాత కాసేపు ఆరబెట్టాలి. ఆ తరువాత వాటిని యధాతథంగా అమర్చాలి. ఏసీ ప్యానెల్‌ను క్లోజ్ చేసి.. పవర్ ఆన్ చేయాలి.
గమనిక: ఇంట్లో ఏసీ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏసీలో మరేదైనా సమస్య ఉంటే మీరే శుభ్రం చేసుకునే బదులు టెక్నీషియన్ సహాయం తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 20 , 2024 | 08:12 AM