Ayodhya Ram Mandir: అయోధ్య రామయ్య ప్రసాదం వెరీ స్పెషల్.. ఆ బాక్స్‌లో 7 వెరైటీలు.. అవేంటంటే..!
ABN, Publish Date - Jan 22 , 2024 | 05:47 PM
Ayodhya Ram Mandir: శతాబ్ధాల నాటి కల సాకారమైంది. ఇన్నాళ్లూ గూడులేకుండా గుడారంలో ఉన్న అయోధ్య రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరారు. పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా రాములోరి ప్రతిష్ఠాపన కార్యక్రమం సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ సభ్యులు సహా దేశ విదేశాల నుంచి సుమారు 7 వేల మందికి పైగా ప్రముఖులు ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించారు.
అయోధ్య, జనవరి 22: శతాబ్ధాల నాటి కల సాకారమైంది. ఇన్నాళ్లూ గూడులేకుండా గుడారంలో ఉన్న అయోధ్య రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండువగా రాములోరి ప్రతిష్ఠాపన కార్యక్రమం సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ సభ్యులు సహా దేశ విదేశాల నుంచి సుమారు 7 వేల మందికి పైగా ప్రముఖులు ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించారు. స్వామివారి తొలి దర్శనాన్ని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్, పలువురు సాధువులు, అర్చకులు చేసుకోగా.. అనంతరం ఇతర ప్రముఖులు చేసుకున్నారు.
రామయ్య దర్శనానంతరం వారందరికీ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ముందుగానే తయారు చేయించిన ఈ ప్రసాదాన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేయించారు. ఆ ప్రసాదం బాక్సులను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన ప్రముఖులందరికీ అందజేశారు. ఇందులో ప్రత్యేకంగా ఏడు రకాల ప్రసాదాలు పెట్టినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. వీటిలో రెండు లడ్డూలు, బెల్లం రేవ్‌డీ, రామదాన చిక్కీ, అక్షింతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిదను పెట్టారు. ఈ బాక్సు కాషాయ రంగులో ఉండగా.. దానిపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర లోగో ముద్రించారు. దీనిని ప్రత్యేక సంచిలో పెట్టి ప్రముఖులకు అందజేశారు. ఇక అయోధ్యలో రాములోరి ప్రతిష్ఠాపన వేడుకకు హాజరైన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.
Updated Date - Jan 22 , 2024 | 05:47 PM