Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. మార్చిలో ఏకంగా 14రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడంటే..!
ABN, Publish Date - Feb 26 , 2024 | 01:22 PM
డిజిటల్ బ్యాంకింగ్ హవా పెరిగాక చాలా సేవలు ఆన్లైన్ లో గడిచిపోతున్నా కొన్ని అవసరాలకు బ్యాంకులకు వెళ్లాల్సిందే.. మార్చి నెలలో సెలవుల గురించి తెలుసుకుంటే ఈ పనులు సులువు అవుతాయి.
మనిషి నిత్య జీవితంలో బ్యాంకుల పాత్ర చాలా పెద్దది. అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలకు బ్యాంకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. డిజిటల్ బ్యాంకింగ్ హవా పెరిగాక చాలా సేవలు ఆన్లైన్ లో గడిచిపోతున్నాయి. కానీ బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు, చెల్లింపులు మొదలైనవాటికి తప్పనిసరిగా బ్యాంకును సందర్శించాల్సిందే. అయితే ప్రతి నెలలో బ్యాంకులకు కొన్ని రోజులు సెలవులు ఉంటాయి. ఈ సమయాల్లో బ్యాంకులు మూత పడతాయి. ప్రాంతాలను బట్టి బ్యాంకులకు మార్చి నెలలో ఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకుంటే..
జాతీయ సెలవులు..
మార్చి 1: చాప్చార్ కుట్ (మిజోరం)
మార్చి 8: మహాశివరాత్రి (కొన్ని రాష్ట్రాలు మినహా)
మార్చి 25: హోలీ
మార్చి 29: గుడ్ ఫ్రైడే
రాష్ట్ర సెలవులు..
మార్చి 22: బీహార్ దివస్ (బీహార్)
మార్చి 26-27: యయోసాంగ్ రెండవ రోజు/హోలీ (ఒడిశా, మణిపూర్, బీహార్)
సాధారణ సెలవులు..
రెండవ శనివారం: మార్చి 9
నాల్గవ శనివారం: మార్చి 23
ఆదివారాలు: 4,11, 18, 25 తేదీలు.
ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 26 , 2024 | 01:22 PM