ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఏం ఐడియా గురూ.. గేర్ బాక్స్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి.. వీడియో వైరల్!

ABN, Publish Date - Jan 19 , 2024 | 03:56 PM

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. ఒక సమస్య వచ్చినపుడు బుర్ర పెట్టి ఆలోచిస్తే దానికి ఎన్నో పరిష్కార మార్గాలు కనబడతాయి. భారత టెక్ రాజధాని బెంగళూరులోని ఓ కారు డ్రైవర్‌కు అలాంటి సమస్యే వచ్చింది. అతడు దానికి అద్భుతమైన పరిష్కారం కనుగొన్నాడు.

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. ఒక సమస్య వచ్చినపుడు బుర్ర పెట్టి ఆలోచిస్తే దానికి ఎన్నో పరిష్కార మార్గాలు కనబడతాయి. భారత టెక్ రాజధాని బెంగళూరు (Bengaluru)లోని ఓ కారు డ్రైవర్‌కు అలాంటి సమస్యే వచ్చింది. అతడు కొన్ని రోజులుగా భుజం నొప్పితో (Shoulder Pain) బాధపడుతున్నాడు. కారు గేర్లు (Gears) వేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. దాంతో తన ఆలోచనలకు పదును పెట్టి ఓ సరికొత్త ఆవిష్కరణ చేశాడు. స్వయంగా తన సమస్యను పరిష్కరించుకున్నాడు. అతడి తెలివితేటలు చూసి టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లు కూడా ఆశ్చర్యపోతున్నారు (Jugaad Videos).

@ParmarParth91 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆయన బెంగళూరులోని ఉబర్ కారు ఎక్కినపుడు ముందు భాగంలో స్టీరింగ్ పక్కనే ఉన్న గేర్ బాక్స్ చూసి షాకయ్యాడు. పైగా డ్రైవర్ ఆ గేర్లను చేతులతో మార్చడం లేదు. దాని గురించి డ్రైవర్ దురైను ప్రశ్నించగా.. ఆయన అసలు విషయం చెప్పాడు. తాను కొద్ది రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్నానని, గేర్లు మారుస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడంతో రూ.9 వేలు ఖర్చు చేసి స్వయంగా పాడిల్ స్విఫ్టర్ డిజైన్ చేశానని చెప్పాడు. స్టీరింగ్ కింద ఉన్న స్టిక్‌ను ప్యాడిల్ షిఫ్టర్‌గా మార్చారు. దానికి ఒక చిప్‌ను అనుసంధానించారు.

ఆ స్టిక్‌ను కదిల్చినప్పుడల్లా ఆటోమేటిక్‌గా గేర్ మారిపోతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. దాదాపు 13 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``భారతదేశంలో ప్రతిభకు కొదవలేదు``, ``దీనికి వెంటనే ఆయన పేటెంట్ రైట్స్ తీసుకోవాలి``, ``ఎంతో మంది ఇంజినీర్ల కంటే ఈయన చాలా ఉత్తమం`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 19 , 2024 | 03:56 PM

Advertising
Advertising