Viral: యూపీఐతో చాయ్ డబ్బులు చెల్లించిన మోదీ.. ఆశ్చర్యపోయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు!
ABN, Publish Date - Jan 27 , 2024 | 07:37 PM
యూపీఐతో చెల్లింపుల వేగం చూసి ఆశ్చర్యపోయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇంటర్నెట్ డెస్క్: నిన్నటి గణతంత్ర దినోత్సవంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటనపై ఆయన భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మెక్రాన్.. ప్రధాని మోదీతో (Narendra Modi) కలిసి హవా మహల్ వద్ద ఓ షాపులో టీ తాగారు. ఈ క్రమంలో ప్రధాని.. చాయ్ (Chai) డబ్బులను యూపీఐ (UPI) యాప్‌తో చెల్లించారు.
కాగా, రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇచ్చిన అధికారిక విందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీతో కలిసి చాయ్ తాగిన విషయాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ చాయ్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన అన్నారు. ‘‘ఇద్దరం కలిసి చాయ్ తాగాము. ఈ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ చాయ్ డబ్బులు యూపీఐతో చెల్లించారు. ఈ స్నేహం, సంప్రదాయం, సృజనాత్మకత..అన్నీ ప్రత్యేకమైనవి’’ అని మెక్రాన్ అన్నారు.
డబ్బు చెల్లించే సమయంలో ప్రధాని మోదీ యూపీఐ ఏలా పనిచేసేదీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి వివరించారు. సెకెన్ల వ్యవధిలో డబ్బులు బదిలీ కావడం చూసి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆశ్చర్యపోయారు.
కాగా, దేశాధినేతలిద్దరూ చాయ్ తాగుతున్న వీడియోను బీజేపీ.. ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
వివిధ బ్యాంక్ అకౌంట్లను ఒకే మొబైల్ అప్లికేషన్‌తో అనుసంధానించే యూపీఐ చెల్లింపుల వ్యవస్థతో బ్యాంకు అకౌంట్ల మధ్య నగదు బదిలీ అత్యంత సులభంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికశాతం మంది పలు రకాల చెల్లింపులను యూపీఐతో చేస్తున్నారు. గతేడాది ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా కూడా మోదీ యూపీఐ ప్రస్తావన తెచ్చారు. త్వరలో ఫ్రాన్స్‌లోనూ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఆ తరువాత భారత టూరిస్టులు అక్కడ యూపీఐతో చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Updated Date - Jan 27 , 2024 | 07:46 PM