Mothers in Animal Kingdom : జంతువులలో కష్టపడి పిల్లల్ని పెంచే తల్లులు ఏవో తెలుసా.. !
ABN, Publish Date - Feb 20 , 2024 | 11:37 AM
ఫసిఫిక్ ఆక్టోపస్ చాలా కష్టపడి సముద్ర గర్భంలో లోతైన గుహల లోపల దాదాపు 74 వేల గుడ్లు పెడుతుంది. ఇది ఏడు నెలల పాటు కదలకుండా శ్రమతో వాటిని కాపాడుతుంది. ఆహారం కోసం కూడా అక్కడి నుంచి కదలదు. ఇతర ప్రాణుల నుంచి గుడ్లను రక్షిస్తుంది. ఆహారం లేకుండా జీవించడానికి ఈ ఆక్టోపస్ కి తన శరీరంలోని కొవ్వులను కరిగించి ప్రోటీలతో జీవిస్తాయి.
సృష్టి మొదలు నుంచే ఆడ అనే జీవికి శ్రమించే తత్వాన్ని, ఓపికను కాస్త ఎక్కువగానే ఇచ్చాడు అనుకుంటాను. జంతువులలో కూడా చాలా జీవులు మగవాటికంటే ఆడవే ఎక్కువ శ్రమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సివస్తే జంతువులలో మగవి కాస్త నిర్లష్యంగానే ఉంటూ వస్తాయి. తల్లులు మాత్రమే పిల్లల సంరక్షణ బాధ్యతను తీసుకుంటాయి. రెక్కలు తొడిగి గూడు వదిలి వెళ్లే వరకూ తల్లులే సంరక్షిస్తాయి. ఆ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే..
జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్..
ఫసిఫిక్ ఆక్టోపస్ చాలా కష్టపడి సముద్ర గర్భంలో లోతైన గుహల లోపల దాదాపు 74 వేల గుడ్లు పెడుతుంది. ఇది ఏడు నెలల పాటు కదలకుండా శ్రమతో వాటిని కాపాడుతుంది. ఆహారం కోసం కూడా అక్కడి నుంచి కదలదు. ఇతర ప్రాణుల నుంచి గుడ్లను రక్షిస్తుంది. ఆహారం లేకుండా జీవించడానికి ఈ ఆక్టోపస్ కి తన శరీరంలోని కొవ్వులను కరిగించి ప్రోటీలతో జీవిస్తాయి.
ఆఫ్రికన్ ఏనుగు..
రెండు సంవత్సరాలలో ఏనుగులు అన్నీ క్షీరదాల కంటే ఎక్కువ గర్భధారణ కాలం కలిగి ఉంటాయి. ఇవి 200 పౌండ్ల బరువుతో పుట్టిన ఏనుగు పిల్లలు మొదటి రెండు, మూడు సంవత్సరాలు ఆహారం కోసం పూర్తిగా వాటి తల్లులపైనే ఆధారపడి ఉంటాయి.
గ్రే కంగారూ..
బూడిద రంగు కంగారూలలో మాతృత్వం అనేది గర్భధారణ నుంచి ఆహారం వరకూ తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చే వరకూ తల్లి కంగారూలదే బాధ్యత.
ఇది కూడా చదవండి : గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలు తగ్గితే.. ప్లమ్ పండ్లు తింటే చాలట..!
వర్జీనియా ఒపోసమ్..
వర్జీనియా ఒపోసమ్ ఒకే లిట్టర్ లో ఎక్కడైనా నలుగు నుంచి 25 వరకు పిల్లల్ని పెడుతుంది. అవి పెరిగే వరకూ ఇతర జంతువులనుంచి కాపాడుతుంది. పిల్లలు 100 రోజుల పాటు తల్లితో ఉంటాయి.
పెంగ్విన్..
పెంగ్విన్ తల్లి గుడ్డు పెట్టిన తర్వాత పిల్లలు పొదిగే వరకూ తండ్రి పెంగ్విన్ బాధ్యత. పిల్లలు పెరిగే విషయంలో ఆ బాధ్యతను తల్లి పెంగ్విన్ తీసుకుంటుంది. ఎలాంటి తీవ్రమైన వాతావరణంలో నైనా ఎలా జీవించాలో పిల్లలకు నేర్పుతుంది.
సాలెపురుగులు..
సంతానాన్ని కాపాడుకోవడంలో సాలెపురుగులు ముందుంటాయి. తల్లి పిల్లలకు వేటాడటం, మనుగడ నైపుణ్యాలను నేర్పుతుంది.
కిల్లర్ వేల్స్..
తల్లి తిమింగలాలు పిల్లలకు దగ్గరుండి వేట నేర్పుతాయి.
చిరుతలు..
ఒంటరి తల్లులు పిల్లలను పెంచుతాయి. వేట నేర్పుతాయి. చిరుత సంతానం కోసం రక్షణ, మనుగడ నైపుణ్యలను నేర్పుతాయి.
Updated Date - Feb 20 , 2024 | 11:37 AM