ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Clean Slating: డేటింగ్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్.. భారతీయులు ఎక్కువగా ఇదే ఫాలో అవుతున్నారట!

ABN, Publish Date - Jan 24 , 2024 | 03:54 PM

ఇప్పటి వరకు డేటింగ్ సంస్కృతిలో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి, వెళ్లాయి. ఇప్పుడు సరికొత్తగా క్లీన్ స్లేటింగ్ అనే ట్రెండ్ వ్యాప్తిలోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే భారతీయులలో 71శాతం మంది ఆల్రెడీ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నవారేనట.

నేటికాలం యువత కొత్త పరిచయాల కోసం ఎప్పుడూ ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. దీని కారణంగా డేటింగ్ ప్రపంచం చాలా వేగంగా విస్తృతమవుతోంది. ఇప్పటి వరకు డేటింగ్ సంస్కృతిలో ఎన్నో కొత్త పోకడలు వచ్చాయి, వెళ్లాయి. ఇప్పుడు సరికొత్తగా క్లీన్ స్లేటింగ్ అనే ట్రెండ్ వ్యాప్తిలోకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే భారతీయులలో 71శాతం మంది ఆల్రెడీ ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారని సర్వేల భోగట్టా. ఈ క్లీన్ స్లేటింగ్ గూర్చి పూర్తీగా తెలుసుకుంటే..

సింపుల్ గా చెప్పాలంటే గతాన్ని వదిలిపెట్టడమనే కాన్సెప్ట్ తో రూపొందినదే ఈ క్లీన్ స్లేటింగ్. గతంలో గాయాలు, మాజీ ప్రేమికుల గుర్తులు, వైఫల్యాలు మొదలైనవి తరచుగా అందరినీ వేధిస్తుంటాయి. చాలావరకు వ్యక్తిగత అభివృద్దిని ఇవి అడ్డుకుంటూ ఉంటాయి. కానీ క్లీన్ స్లేటింగ్ లో వీటన్నింటిని వదిలిపెట్టి జీవితాన్ని కొత్తగా, కొత్త వ్యక్తితో ప్రారంభించడం. దీనివల్ల కొత్త బంధంలో నిజాయితీ, వ్యక్తిగత ఎదుగుదల, అపార్జాలకు తావు లేకుండా ఉండటం వంటివి సాధ్యమవుతాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Washing Machine: ఈ 4 సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. వాషింగ్ మెషీన్ కొత్తదానిలా పనిచేయడమే కాదు.. మన్నిక కూడా పెరుగుతుంది!



క్లీన్ స్లేటింగ్ వల్ల ప్రయోజనాలేంటంటే..

క్లీన్ స్లేటింగ్ వల్ల గతానికి సంబధించిన ఎమోషన్స్ ను తొలగించుకోవడం సాధ్యమవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడులు తగ్గుతాయి.

కొత్త వ్యక్తులతో పరిచయాలు, వారితో సంబంధాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఉండవు.

కెరీర్ పరంగానూ, వ్యక్తిగత ఎదుగుదలకు ఇది ఎంతో సహాయపడుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Indian Dishes: ప్రపంచ 100 ఉత్తమ వంటకాలలో మనవీ ఓ నాలుగు.. ఘుమఘుమల జాబితాలోని భారత్ ఆహారాలివే..!



క్లీన్ స్లేటింగ్ సక్సెస్ కావాలంటే కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి..

క్లీన్ స్లేటింగ్ లో సక్సెస్ కావాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. గతాన్ని పూర్తీగా వదిలిపెట్టి వర్తమానంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం, బంధంలో ఉన్నవారితో సంతోషంగా ఉండటం ముఖ్యం. గతాన్ని వదలడం కష్టంగానే అనిపించినా అది చాలా అవసరం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

ఎలాంటి బంధంలో అయినా నిజాయితీ ముఖ్యం. ఓపిక, నిజాయితీ లేకపోతే క్లీన్ స్లేటింగ్ విఫలం అవుతుంది. చెప్పాలనుకునే విషయాన్ని స్పష్టంగా చెప్పడం, భాగస్వామి దగ్గర నిజాయితీగా ఉండటం ముఖ్యం. ఇది బంధాన్ని బలంగా మారుస్తుంది.

గతంలో జరిగిన తప్పులను క్షమించడం, తప్పుల నుండి అనుభవాలు నేర్చుకోవడం, వాటిని మళ్లీ చేయకుండా ఉండటం కూడా క్లీన్ స్లేటింగ్ లో ఒక భాగం. కోపం,ద్వేషం, పగ, ప్రతీకారం వంటివి వదిలేయాలి.

ఎప్పుడూ పాజిటీవ్ గా ఉండాలి. పాజిటీవ్ గా ఉన్న వ్యక్తులతో కలవడం, అలాంటి వారితో సమయం గడపడం, సహాయం పొందితే కృతజ్ఞతలు చెప్పడం మొదలైనవాటి వల్ల వ్యక్తిగతంగా ఎదుగుదల, సంతోషం ఉంటుంది.

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 03:54 PM

Advertising
Advertising