Daughters: 15ఏళ్లు వచ్చేలోపు ఆడపిల్లలకు ఈ 5 విషయాలు నేర్పండి చాలు.. ధీమాగా బ్రతికేస్తారు..!
ABN, Publish Date - Jan 30 , 2024 | 04:05 PM
ఆడపిల్లలు ధీమాగా బ్రతకాలి అంటే ఈ 5 విషయాలను తల్లిదండ్రులు వారికి నేర్పించాలి.
కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నిర్దాక్షిణ్యంగా కడుపులోనే చిదిమేసే కాలం, ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో ఏదో పెద్ద భారం చేరిందనే కాలం దాటి ఆడపిల్లలు కావాలని తల్లిదండ్రులు తపించే కాలానికి చేరుకున్నాం. కానీ సమాజంలోనూ, ఉద్యోగాలు చేసే చోట, చదువుకునే దగ్గర, పెళ్ళయ్యాక అత్తారింట్లో ఇలా ప్రతిచోటా ఆడపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు 15ఏళ్ల తరువాత కాలేజీలకు వెళ్లడం మొదలుపెడతారు. అక్కడ ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలకు కూడా దారితీస్తాయి. వీటన్నింటిని అర్థం చేసుకోవాలన్నా, ధీమాగా తమ జీవితాన్ని గడపాలన్నా వారికి 15ఏళ్ళు వచ్చేలోపు తల్లిదండ్రులు 5 విషయాలు తప్పక నేర్పించాలి. అవేంటో తెలుసుకుంటే..
ఒంటరిగా ప్రయాణించడం నేర్పించాలి..
కాలేజీలకు వెళ్లే పిల్లల వెంట ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండలేరు. అందుకే 15ఏళ్ల తరువాత అమ్మాయిలు ఆటో, బస్, మెట్రో లాంటి వాటిలో ఒంటరిగా ప్రయాణం చేసే స్వేచ్చను ఇవ్వాలని అంటున్నారు. దీనివల్ల ఆడపిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి భద్రత దృష్ట్యా లొకేషన్ ట్రాక్ చేయడం వంటివి తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. సమస్యలను ఎదుర్కొనే వైఖరి అలవడుతుంది.
ఇది కూడా చదవండి: Eye Test: ఛాలెంజ్ చేస్తారా? 8సెకెండ్లలో ఈ ఫ్లెమింగోల మధ్య దాక్కున్న అమ్మాయిని గుర్తుపడితే మీరే తోపు..!
సెల్ఫ్ కేర్..
భారతదేశంలో తల్లిదండ్రులు పెళ్లయ్యే వరకు ఆడపిల్లలకు కావాల్సిందల్లా తామే చూసుకుంటారు. తాము చెప్పినట్టే వినాలని అనుకుంటారు. ఇలాంటి మెంటాలిటీని పూర్తీగా వదిలెయ్యమని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. ఆడపిల్లలకు సమతులాహారం, వేసుకునే దుస్తులు దగ్గరనుండి తమనుతాము రక్షించుకోవడం వరకు అన్నీ నేర్పించాలి. వాళ్లను వాళ్లు రక్షించుకుంటే వారి జీవితంలో భయానికి చోటు ఉండదు.
డబ్బు విలువ..
ఆడపిల్లలకు డబ్బు విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మగపిల్లలకు కూడ ముఖ్యమైన విషయమే అయినా ఆడపిల్లలు పెళ్లయ్యాక చాలా విషయాలను డీల్ చేయడానికి మనీ మెయింటైన్స్ అవసరం. ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చు చెయ్యాలి? డబ్బు ఎలా పొదుపు చెయ్యాలి? దేనికి ఎక్కువ ఖర్చుపెట్టకూడదు మొదలైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా పెళ్లయ్యాక ఆడపిల్లలకు ఆర్థిక భద్రత ఎంతో అవసరం. 15 ఏళ్ళ లోపే డబ్బు విలువ తెలియజేస్తే తరువాత వారు బాధపడే సందర్భం రాదు.
ఇది కూడా చదవండి: ఎర్ర కందిపప్పు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
శుభ్రత..
వ్యక్తిగత శుభ్రతతో పాటూ ఇంటి శుభ్రత కూడా నేర్పించాలి. తన చుట్టూ ఉన్న ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఆడపిల్ల ఆరోగ్యానికి కూడా అవసరం. నెలసరి సమయాల్లోనూ, బయట టాయిలెట్లు ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్తలు, అవగాహన కల్పించడం ముఖ్యం.
సమయం విలువ..
పిల్లలకు సమయం విలువ తెలియజెప్పడం చాలా ముఖ్యం. టైం మేనేజ్మెంట్ సరిగా ఉంటే పిల్లలు జీవితంలో చాలా సాధించగలుగుతారు. ఇది మగపిల్లలకు కూడా ముఖ్యమైనదే.. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలియజెప్పడం కూడా ముఖ్యం. సమయపాలన పాటించడం ద్వారా జీవితంలో ఎంత గొప్ప విజయాలు సాధ్యమవుతాయో వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
ఇది కూడా చదవండి: Viral: ఐఐఎంలో చదువుతున్న కొడుకుకు ఉత్తరం రాసిన తల్లి.. అందులో ఆమె కొడుకుకు ఇచ్చిన సలహాలేంటంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 30 , 2024 | 04:05 PM