మీకు తెలుసా?
ABN, Publish Date - Feb 04 , 2024 | 11:31 AM
పుల్ల ఐస్‌క్రీమ్‌ను (1905) కనుక్కున్నది 11 ఏళ్ల ఫ్రాంక్ ఎప్పర్‌సన్.....
పుల్ల ఐస్‌క్రీమ్‌ను (1905) కనుక్కున్నది 11 ఏళ్ల ఫ్రాంక్ ఎప్పర్‌సన్.
ఫ్లెమింగోలు మోకాళ్లతో కాదు, చీలమండలతో వంగుతాయి.
పాపాల నుంచి దృష్టి మరల్చడానికి రోలర్‌కోస్టర్ కనిపెట్టారు అమెరికన్లు.
చంద్రునిపై నీడ ముదురురంగులో కనిపిస్తుంది.
అడాల్ఫ్ హిట్లర్ ఓసారి నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.
నీలి తిమింగలం నాలుక ఓ చిన్నపాటి ఏనుగు బరువంత ఉంటుంది.
పాస్‌పోర్టులు పాడవ్వకుండా ముదురురంగుల్లో ముద్రించారు.
ఎనభైశాతం మంది ముచ్చట్లలో ముప్పావు వంతు పుకార్లు, ఫిర్యాదులే ఉంటాయట.
క్వీన్ ఎలిజబెత్‌కు చెందిన ఆవులు వాటర్‌బెడ్ మీద నిద్రించేవి.
ప్రతిగంటకు ఆరు లక్షల చొప్పున 70 ఏళ్ల వయసుకు 47 కిలోల చర్మకణాలను కోల్పోతారు.
మనిషి ఊపిరి తీసుకున్నప్పుడు 15 శాతం తాజా గాలి నింపుకుంటే .. డాల్ఫిన్లు మాత్రం 90 శాతం తీసుకుంటాయి.
మేడంక్యూరీ నోట్‌పుస్తకాల్లో నేటికీ రేడియోధార్మికత ఉంది. వీటిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకు అనారోగ్య ప్రమాదం ఉండటంతో అంగీకార పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
స్టాచ్యూఆఫ్ లిబర్టీ ఒకప్పుడు లైట్‌హౌస్.
హమ్మింగ్ బర్డ్స్ నడవలేవు, దూకలేవు.
అన్ని కీటకాలకంటే చెద పురుగుల జీవితకాలం ఎక్కువ. కొన్నయితే వందేళ్లు బతగ్గలవు.
ప్రపంచంలో ఇప్పటివరకు విమానాశ్రయాలు లేని దేశాలు ఐదు.
పొగతాగడం మాన్పించడం కోసమే పెజ్‌క్యాండీ కనిపెట్టారు.
Updated Date - Feb 04 , 2024 | 11:31 AM