ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Blue Insects: ప్రకృతిలో నీలం ఎందుకు అరుదైన రంగో తెలుసా..!!

ABN, Publish Date - Jan 19 , 2024 | 02:08 PM

ప్రత్యేకమైన వర్ణద్రవ్యం కలిగిన ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులలా కాకుండా, నీలం రంగును తక్కువగా చూస్తూ ఉంటాం.

blue insects

ప్రకృతిలో నీలం రంగు అరుదుగా ఉండటానికి ఒక ప్రధాన కారణం మొక్కలు, జంతువులలో నిజమైన నీలం వర్ణద్రవ్యం లేకపోవడం. ప్రత్యేకమైన వర్ణద్రవ్యం కలిగిన ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులలా కాకుండా, నీలం రంగును తక్కువగా చూస్తూ ఉంటాం. భూమిపై నీలం చాలా ప్రముఖమైన రంగు, అందమైన రంగు కూడా నీలమే. ఆకాశం, మహా సముద్రాలు నీలం రంగులో ఉన్నాయి. ఈ రంగును చూడటం వల్ల శాంతి కలుగుతుంది.

నీలం వర్ణం..

నీలం రంగు చాలా అరుదుగా ప్రకృతిలో కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జీవులు మాత్రమే నిజమైన నీలం వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే సహజంగా ఏ సమ్మేళనం లేకుండా వస్తువులను నీలం రంగులో చూడలేము. ఈ సమ్మేళనం లేకుండా నీలం రాళ్ళు, ఖనిజాలు మనకు కనిపించవు. ఆఫ్ఘనిస్తాన్‌లో తవ్విన లాపిస్ లాజులి మాత్రమే, అల్ట్రామెరైన్ అనే అరుదైన నీలి వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే ఏకైక ఖనిజం. దాని ప్రత్యేకత కారణంగా, ఎన్నో ఏళ్ళ క్రితం లాపిస్ లాజులిని పవిత్రంగా భావించేవారట.

మొక్కలకు నీలం ఆకులు..

మొక్కలకు నీలం రంగు ఎందుకు అరుదు అనేది చూస్తే.. బ్లూ పిగ్మెంట్లు ఏ మొక్కలోనూ కనిపించవు, కొన్ని మొక్కలు నీలం రంగులో ఉంటాయి కానీ వాటి అసలు రంగు అది కాదు. నీలిరంగు పువ్వులు వాటి DNA మార్చిన తర్వాత PH స్థాయిలతో కృత్రిమంగా పెంచబడతాయి.

ఆకులు కూడా నీలిరంగులో కనపించవు. కొన్ని మొక్కలు అధిక శక్తి కాంతిని ప్రతిబింబించినప్పుడు, వాటి ఆకులు నీలం రంగులో కనిపిస్తాయి. అయితే, అధిక శక్తి కాంతి మొక్కల ఆరోగ్యానికి హానికరం. భూమి మీద ఉన్న అన్నిరకాల పుష్పించే మొక్కలలో 10% మాత్రమే నీలం రంగులో కనిపిస్తాయి.

జంతువులు ఎందుకు నీలం..

జంతువుల రంగు సాధారణంగా వాటి ఆహారం నిర్ణయిస్తుంది. ఫ్లెమింగోలు రొయ్యలలో కనిపించే రంగు కారణంగా గులాబీ రంగులో ఉంటాయి. గోల్డ్ ఫిష్ నీటి ఆహారం నుండి బంగారు రంగులో కనిపిస్తుంది. ప్రకృతిలో ఏదైనా నీలిరంగు ఆహారం గురించి ఆలోచిస్తే.. బ్లూ జే పక్షి.. ఇవి నీలం రంగును వేరే ప్రక్రియతో పొందుతాయి. వాటి ఈకలు కాంతిని వెదజల్లే సూక్ష్మ పూసలను కలిగి ఉంటాయి.అందువల్లనే ఈ పక్షి నీలం రంగులో కనిపిస్తుంది.

ఓబ్రినా ఆలివ్‌వింగ్ సీతాకోకచిలుక..

ఓబ్రినా ఆలివ్‌వింగ్ సీతాకోకచిలుక మాత్రమే నిజమైన నీలం వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయగల ఏకైక జంతువు. బ్లూబాటిల్ సీతాకోకచిలుక నీలం, ఆకుపచ్చ రెక్కలు వర్ణద్రవ్యం, లుటీన్ అని పిలువబడే నీలి రంగులో కెరోటినాయిడ్ కారణంగా ఏర్పడతాయి. దక్షిణ అమెరికాలో కనిపించే Morpho సీతాకోక చిలుక కూడా నీలం రెక్కలను కలిగి ఉంటుంది, అయితే ఈ నీలం కాంతి ప్రతిబింబం వల్ల ఏర్పడింది మాత్రమే.

Updated Date - Jan 19 , 2024 | 02:08 PM

Advertising
Advertising