ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Food Hacks: చలికాలంలో ఆహారం తొందరగా చల్లగా అవుతోందా? ఈ 7 సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి!

ABN, Publish Date - Jan 14 , 2024 | 01:48 PM

చలికాలంలో వండిన ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ సింపుల్స్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడానికి బాగుంటుంది. ముఖ్యంగా టిఫిన్, భోజనం వేడిగా లేకపోతే తినలేం. ఇక చలికాలంలో చల్లగా అయిన ఆహారం తినాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ చలి కారణంగా ఆహారం వండిన అరగంటలోపే చల్లగా అయిపోతుంది. స్కూళ్లకు, ఆఫీసులకు, కాలేజీలకు లంచ్ బాక్సులు తీసుకెళ్లేవారికి ఇది మరింత ఇబ్బంది. చలికాలంలో వండిన ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ కింది సింపుల్స్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

థర్మోస్ బాక్సులు..

టిఫిన్ లేదా భోజనం వేడిగా తినాలని ఉంటే ఇందుకోసం థర్మోస్ లంచ్ బాక్సులు ఉపయోగించాలి. ఇవి ఆహారం వేడిని నిలకడగా ఉంచుతాయి. థర్మోస్ బాక్సులను కాగితపు టవల్ లేదా హ్యాండ్ కర్చీఫ్ లో చుట్టి ఉంచడం వల్ల మరింత ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: పచ్చిపాలతో భలే అందం!


ఇన్సులేటెడ్ కంటైనర్లు..

మధ్యాహ్నం భోజనం వరకు ఆహారం వేడిగా ఉండాలంటే వంట అవ్వగానే ఆహారాన్ని ఇన్సులేటెడ్ కంటైనర్లలో ఉంచాలి. ఇవి ఆహారం ఉష్ణోగ్రతనే కాదు రుచి, సువాసనను కూడా నిలిపి ఉంచుతాయి.

హీట్ టెక్నిక్..

లంచ్ బాక్సులలో ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉండటానికి హీట్ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. మందుగా శుభ్రంగా ఉన్న లంచ్ బాక్సులలో బాగా మరగబెట్టిన నీటిని పోయాలి. తరువాత బాక్స్ మూత పెట్టాలి. వంట మొత్తం రెఢీ అయ్యాక బాక్సులో నీటిని తీసివేసి బాక్సు బాగా తుడిచి అందులో ఆహారం పెట్టాలి. ఇది ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచుతుంది.

హాట్ వాటర్..

లంచ్ బాక్సు దిగువన వేడి నీటి బాటిట్ ను ఉంచడం వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. వాటర్ బాటిల్ లో మూడువంతులు వేడినీటిని పోసి దాన్ని లంచ్ బాక్స్ బ్యాగ్ అడుగున, మరొక బాటిల్ ను లంచ్ బాక్స్ పైన ఉంచాలి.

ఇది కూడా చదవండి: Apple Seeds: యాపిల్ విత్తనాలు తింటే చచ్చిపోతారా? పొరపాటున యాపిల్ విత్తనాలు కడుపులోకి వెళితే జరిగేదిదే..!



హీట్ ప్యాక్..

సాధారణంగా ఒళ్లు నొప్పులు, వాపుల మీద హీట్ ప్యాక్ పెడుతుంటారు. లంచ్ బాక్స్ పక్కనే హీట్ ప్యాక్ కూడా పెట్టుకుని తీసుకెళ్ళడం వల్ల ఆహారం వేడిగా ఉంటుంది.

వేర్వేరుగా..

చల్లని ఆహారాలైన పెరుగు, ఐస్ క్రీమ్, పండ్లు వంటివి వేడి ఆహార పదార్థాలతో పాటు ఉంచకూడదు. వాటిని విడిగా ప్యాక్ చేసుకోవాలి. చల్లని ఆహారాలు వేడి ఆహారాలను డ్యామినేట్ చేస్తాయి.ఫలితంగా రెండూ ఉష్ణోగ్రత కోల్పోతాయి.

అల్యూమినియం ఫాయిల్..

దాభా, రెస్టారెంట్, హోటల్స్ లో ఎక్కువగా ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్ ను కూడా ఉపయోగించవచ్చు. రోటీలు, చపాతీల కోసం అల్యూమినియం ఫాయిల్ రోల్.. కూరలు, ఆహారం ప్యాక్ చేయడానికి అల్యూమినియం కవర్లు వాడచ్చు. కంటైనర్ల అంత ప్రభావవంతంగా కాకపోయినా కొన్ని గంటలపాటూ ఇది వేడిని నిలిపి ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: రోజూ ఓ స్పూను నువ్వులు నమిలి తింటే.. ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 01:48 PM

Advertising
Advertising