ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kohler Bidet Seat: కోహ్లర్ కంపెనీ నుంచి రాబోతున్న అత్యాధునిక టెక్ టాయిలెట్ సీటు.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!

ABN, Publish Date - Jan 07 , 2024 | 01:45 PM

టెక్నాలజీ మారింది. రోజుకో ఎలక్ట్రిక్ డివైజ్ మార్కెట్లోకి వస్తోంది. అప్‌గ్రేడ్ కూడా అవుతున్నాయి. వాయిస్ కంట్రోల్ (Voice Control) ఫీచర్స్ వచ్చేశాయి. వాష్ రూమ్‌కు (Wash Room) కూడా అందుబాటులోకి వచ్చాయి.

కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారింది. రోజుకో ఎలక్ట్రానిక్ పరికరం మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఫ్యాన్లు, లైట్ల నుంచి టీవీలు, వాహనాల వరకు వాయిస్ కంట్రోల్‌తో నియంత్రించే టెక్ పరికరాలు ఈ మధ్య మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాయిస్‌తో కంట్రోల్ చేసే పరికరాల జాబితాలో తాజాగా టాయిలెట్ బేసిన్ కూడా చేరింది. ఈ పరికరానికి సంబంధించిన ప్రత్యేకతలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం...


టాయిలెట్ సీటు ధర అధరహో..!

వాష్ రూమ్‌లో (Wash Room) ఉండే మోడెమ్ కూడా కొత్త హంగులతో వస్తున్న నేపథ్యంలో కోహ్లర్ కంపెనీ అత్యాధునిక లగ్జరీ టాయిలెట్ ‌సీటును మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ప్యూర్ వాష్ ఈ930 అనే పేరుతో పరిచయం చేస్తున్న ఈ టాయిలెట్ సీటును అమెజాన్ అలెక్సా (Alexa) లేదంటే గూగుల్ హోమ్‌కు (Googl Home) అనుసంధానించుకోవచ్చు. తద్వారా వినియోదారులు టాయిలెట్ సీటుతో మాట్లాడే వీలుంటుంది.

ఆటోమేటిక్‌గా క్లీన్

ఫ్యూర్ వాష్ ఈ930 సీటు 3.5 ఇంచులతో ఉన్న ఎత్తులో డిజైన్ చేశారు. సీటు మీద కూర్చొని ఉష్ణోగ్రత, నీటి ఒత్తిడిని మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇందులో పిల్లల కోసం మృదువుగా చైల్డ్ మోడ్ కూడా ఉంది. పెద్దవారు కావాలని అనుకుంటే హై ప్రెషర్ ఫీచర్ బూస్ట్ స్ప్రే ఉంది. సీటు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లో ఉంటుంది. 24 గంటలకు ఒకసారి యూవీ లైట్‌తో ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తోంది. దీంతో మనుషులు వాష్ చేయాల్సిన అవసరం ఉండదు.

సీటు ఓపెన్ అండ్ క్లోజ్

మోడ్రన్ టాయిలెట్ సీటు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సీటు ఆటోమెట్‌క్ ఓపెన్ (Open) అవుతోంది.. అలాగే క్లోజ్ కూడా అవుతోంది. సెట్టింగ్‌లలో టెంపరేచర్ మార్చుకునే అవకాశం ఉంది. అలాగే మీకు వాష్ రూమ్‌లో నైట్ లైట్ అవసరం అయితే ఎల్ఈడీ లైట్ కూడా వస్తుంది.

ధర రూ.1.80 - రూ.9 లక్షలు వరకు..

ఈ టాయిలెట్ సీటు ధర ఎక్కువగానే ఉంది. కోహ్లర్ (Kohler) కంపెనీ మోడ్రన్ టాయిలెట్ సీటు ప్రారంభ ధర 2149 అమెరికన్ డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 1 లక్షా 80 వేల వరకు ఉంది. ఇది బేసిక్ టాయిలెట్ సీటు ఇందులో హై ఫీచర్స్ కూడా ఉన్నాయి. కోహ్లర్‌‌లోనే న్యుమి 2.0 అనే టాయిలెట్ సీటు 11000 వేల డాలర్ల వరకు ఉంది. అంటే మన కరెన్సీలో 9.1 లక్షలుగా పలుకుతుంది. ఇందులో కస్టమైజ్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన లైటింగ్, ఆడియో స్పీకర్ సిస్టమ్ సెట్ చేసుకునే ఛాయిస్ ఇచ్చింది.

సీఈఎస్‌లో ప్రదర్శన

కోహ్లర్ (Kohler) తన ప్యూర్ వాష్ ఈ930 టాయిలెట్ సీటు 2024 కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో (సీఈఎస్) ప్రదర్శిస్తారు. లాస్ వెగాస్‌లో వచ్చే వారం సీఈఎస్ లాస్ వెగాస్‌లో ప్రారంభం అవుతుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ హెల్త్, స్మార్ట్ హోమ్ ఆవిష్కర్తలు పాల్గొంటారు. వీరే కాక 3500 పైచిలుకు ఎగ్జిబిటర్లు సీఈఎస్ ప్రదర్శనకు హాజరవుతారని తెలిసింది. అందులో కోహ్లర్ కంపెనీ టాయిలెట్ సీటు ప్రదర్శనకు రానుంది. మరి వినియోగదారులను ఏ మేరకు ఆకట్టుకోనుందో చూడాలి మరి.

Updated Date - Jan 07 , 2024 | 02:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising